ISRO: మరో చరిత్ర సష్టికి సిద్ధమైన ఇస్రో-రాత్రికి కీలక ప్రయోగం-2024కు ఘన వీడ్కోలు..!

ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాలలో ఎన్నో అడుగులు ముందుకు వేసిన ఇస్రో ఇవాళ మరో కీలక ప్రయోగానికి సిద్దమవుతోంది. ఇప్పటివరకూ చేసిన ప్రయోగాలలో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి స్పేస్ డాకింగ్ టెక్నాలజీని ప్రయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్ని మరింత సునాయాసంగా మార్చేందుకు ఇస్రో సిద్దమవుతోంది. ఈ రాత్రికి పీఎస్ఎల్వీ సీ60 వాహన నౌక ద్వారా ఈ కీలక ప్రయోగం చేపట్టబోతోంది.

అంతరిక్షంలోకి పంపే వాహన నౌకల్ని సునాయాసంగా దానికి అనుసంధానం చేసేందుకు వీలుగా తయారు చేసిన స్పేస్ డాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవాళ ఇస్రో పరీక్షించబోతోంది. ఇది విజయవంతమైతే మరింత సలువుగా అంతరిక్ష నౌకల్ని ప్రయోగించేందుకు వీలవుతుందని అంచనా. ఇది భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక మలుపు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవాళ రాత్రి 9.45 గంటలకు జరిగే ఈ ప్రయోగం ఇస్రోకు చాలా కీలకంగా మారింది.

ISRO all set to launch year ender SpaDeX mission tonight- how it is important to india

దాదాపు 220 కిలోల బరువు ఉన్న రెండు ప్రత్యేకంగా తయారు చేసిన ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ సీ60 వాహన నౌకకు అనుసంధానించి ఇస్రో ప్రయోగించబోతోంది. వీటికి ఛేజర్, టార్గెట్ అనే రెండు పేర్లు కూడా పెట్టారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్లను అనుసంధానిస్తారు. ఇప్పటివరకూ ఈ పరిజ్ఢానం కేవలం అమెరికా, రష్యా, చైనా వద్దే మాత్రమే ఉంది. ఇప్పుడు మనం సక్సెస్ అయితే స్పేస్ డాకింగ్ పరిజ్ఞానం కలిగిన నాలుగో దేశంగా అవతరించడం ఖాయం.

అంతే కాదు త్వరలో ఇస్రో చేయబోయే పలు ప్రయోగాలకు ఈ స్పేస్ డాకింగ్ ప్రయోగం చాలా కీలకం. ఇస్రో త్వరలో మానవసహిత గగన్ యాన్ ప్రయోగం చేయబోతోంది. అలాగే చంద్రయాన్ 4 శాంపిల్ రిటర్న్ మిషన్ చేపట్టబోతోంది. అలాగే అంతరిక్షంలో భారత అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)ను నెలకొల్పబోతోంది. వీటన్నింటికీ ఇప్పుడు ఈ స్పేస్ డాకింగ్ మిషన్ కీలకంగా మారింది. ఖగోళ పరిజ్ఞానం విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఇస్రో దీన్ని డిజైన్ చేసింది. దీంతో ఈ ప్రయోగాన్ని పలు దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+