Ind-NZ ODI Series: కివీస్ తో వన్డేలకు టీమ్ ఎంపిక..! బీసీసీఐ కీలక అప్డేట్..!

కొత్త ఏడాదిలో న్యూజీలాండ్ తో స్వదేశంలో వన్డే సిరీస్ కు భారత జట్టు సిద్దమవుతోంది. ఈ నెల 11 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టు ఎంపికపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం ఈసారి జట్టులో స్ధానాల కోసం నెలకొన్న పోటీయే. దీంతో వచ్చే వారం మొదలయ్యే భారత్-కివీస్ వన్డే సిరీస్ కోసం జట్టు ఎంపికపై బీసీసీఐ ఇవాళ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు.

కివీస్ తో మూడు వన్డేల్లో ఆడబోయే భారత జట్టును ఇవాళ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ మేరకు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇవాళ సమావేశమవుతుందని ఆయన ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం తాము సెలెక్టర్లతో భేటీ అవుతామని, అనంతరం కివీస్ తో మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటిస్తామని సైకియా వెల్లడించారు. దీంతో ఇవాళ సెలెక్టర్లు చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

India vs New Zealand ODIs BCCI Secretary Confirms Team Announcement is Imminent

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఈ సిరీస్ కీలకంగా బీసీసీఐ భావిస్తోంది. ఇందులో ఎంపికయ్యే ఆటగాళ్లను సైతం వన్డే వరల్డ్ కప్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయాలని అనుకుంటోంది. దీంతో ఈసారి వన్డే జట్టులో ఉంటే చాలు వరల్డ్ కప్ కు ఎంపికయ్యేందుకు దారులు తెరుచుకున్నట్లే అని క్రికెటర్లు కూడా భావిస్తున్నారు. దీంతో కివీస్ తో వన్డే జట్టు ఎంపిక కీలకంగా మారిపోయింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికలో స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ను తప్పించి సంచలనాలు రేపిన బీసీసీఐ ఈసారి కివీస్ తో వన్డేలకు కూడా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

India vs New Zealand ODIs BCCI Secretary Confirms Team Announcement is Imminent

వన్డే జట్టులో ఉన్నా ఫామ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన దేవదత్ పడిక్కల్ కు జట్టులో ఛాన్స్ దక్కే అవకాశముంది. అన్నింటికంటే మించి సెలెక్టర్లు కొంతకాలంగా పట్టించుకోని పేసర్ మొహమ్మద్ షమీని ఈసారి కివీస్ తో వన్డేలకు కచ్చితంగా జట్టులో తీసుకుంటారని భావిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+