India Vs Zimbabwe: జింబాబ్వేతో మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఖరారు..!

టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో భాగంగా సూపర్ 8లో తొలి మ్యాచ్ కోల్పోయిన భారత్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో ఆడిన జట్టులో కీలక మార్పులు చేయాలనే ఒత్తిడి మేనేజ్ మెంట్ పై పెరిగింది. దీంతో జట్టులో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ కు జట్టులో మూడు లేదా నాలుగు మార్పులు జరగబోతున్నాయి.

భారత్, జింబాబ్వే మధ్య సూపర్ 8 మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సూపర్ 8లో ఈ రెండు జట్లూ దక్షిణాఫ్రికా, వెస్డిండీస్ చేతిలో ఘోర పరాజయాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ ఓటమికి సిద్దంగా లేవు. ముఖ్యంగా ఈ టోర్నీ ఆతిథ్యదేశమైన భారత్ పై ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది. దీంతో నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

India s Predicted XI Samson In Tilak Rinku Sundar Benched for Zimbabwe Match

అలాగే సుందర్‌తో పాటు, తిలక్ వర్మ, అభిషేక్ శర్, రింకు సింగ్ లను కూడా తప్పించబోతున్నారు. రింకూ సింగ్ స్ధానంలో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే చెన్నై వికెట్‌ పై కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పించనున్నారు. అటు పేలవ ఫామ్ లో ఉన్న అభిషేక్ వర్మ లేదా తిలక్ వర్మ ఇద్దరిలో ఒకరిని తప్పించి సంజూ శాంసన్ కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే టాప్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువయ్యారన్న విమర్శల మధ్య అభిషేక్, తిలక్ పై కత్తి వేలాడుతోంది. కాబట్టి అభిషేక్ కు అవకాశం ఇచ్చి తిలక్ వర్మను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+