IPL Auction 2024: ఐపీఎల్ వేలంలో ఆల్ టైం హై రికార్డు- 24.75 కోట్లకు ఆసీస్ బౌలర్ ను కొన్న కోల్ కతా..!

ఇవాళ జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఉదయం సన్ రైజర్స్, ఢిల్లీ, చెన్నై జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లకు వెచ్చించిన ధరలే రికార్డులు బద్దలు కొడితే.. వాటిని తోసిరాజని కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లకు ఓ కీలక ఆటగాడిని దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడి మరీ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ను ఈ ఆల్ టైం హై ధరకు కోల్ కతా చేజిక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఇదో రికార్డుగా నిలిచింది.

IPL 2024 వేలం లో ఇవాళ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ లో ఓ ఆటగాడికి ఇప్పటివరకు పలికిన అత్యధిక ధరగా రికార్డుల్లో నిలవబోతోంది. ఇవాళ ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడంతో ఇదే రికార్డుగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత స్టార్క్ ఆ రికార్డు బద్దలు కొట్టేశాడు.

IPL 2023 Auction: kkr spends all-time high price rs.24.75 cr for australian pacer mitchell starc

వాస్తవానికి ఐపీఎల్ చరిత్రలో జరిగిన వేలాల్లో తొలిసారి ఇవాళ రూ.20 కోట్ల మార్కు రికార్డు బద్దలైంది. పాట్ కమిన్స్ కు రూ.20.50 కోట్లు పెట్టి సన్ రైజర్స్ కొనుగోలు చేయడంతో ఆ రికార్డు నమోదైంది. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ను రూ.24.75 కోట్లకు కొనడం ద్వారా కోల్ కతా ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. ఇవాళ జరిగిన వేలంలో కివీస్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా. . హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లలో కీలకంగా ఉన్న ఎడమచేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్ తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలోనూ స్టార్క్ పాత్ర ఎంతో ఉంది. దీంతో స్టార్క్ ను ఆల్ టైం హై ధర పెట్టి కోల్ కతా దక్కించుకుంది. స్టార్క్ ను కోల్ కతా ఇంత భారీ ధరకు దక్కించుకోవడంతో అతని కోసం చివరివరకూ పోటీ పడిన గుజరాత్ నిరాశకు గురైంది. స్టార్క్ అద్భుతమైన ఆటగాడని, కేకేఆర్ కు అతన్ని కోల్పోయామని గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+