రోహిత్ శర్మ లైఫ్‌లో కొత్త టర్నింగ్ పాయింట్
GT vs MI: ఐపీఎల్ 2024 సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పంజాబ్, మూడో పొజీషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ నిలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లల్లో ఘన విజయం సాధించాయి. ప్రత్యర్థిని మట్టికరిపించాయి.
వీకెండ్ కావడంతో నేడు కూడా డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి మ్యాచ్ మొదలవుతుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. లీగ్స్ దశలో ఇది ఫోర్త్ మ్యాచ్. ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరమే.

రెండో మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు జరుగనుంది. దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం. గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుందీ మ్యాచ్‌లో. ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. కారణం- రోహిత్ శర్మే. నాన్ కేప్టెన్ హోదాలో ఆడబోతోండటమే.
తొమ్మిది సంవత్సరాల తరువాత రోహిత్ శర్మ నాన్ కేప్టెన్‌గా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడబోతోన్నాడు. ఓ సాధారణ ప్లేయర్‌గా, ఓపెనర్ రోల్‌ను మాత్రమే పోషించనున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం ఈ జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్‌ను కాదని గుజరాత్ టైటాన్స్ కేప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను ఏరికోరి తెచ్చుకుంది. సారథిగా అపాయింట్ చేసింది.
నాన్ కేప్టెన్‌గా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మ్యాచ్ ఆడనుండటం 2013 తరువాత ఇదే తొలిసారి. 2013 ఏప్రిల్ 21వ తేదీన చివరిసారిగా ఈ జట్టులో ఓ ప్లేయర్ హోదాలో ఆడాడు. ఆ తరువాత జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. అదే ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది ముంబై. ఆ తరువాత 2015, 2017, 2020ల్లో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications