IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో స్టార్ ప్లేయర్లకు షాకులు..! లిస్ట్ లో వీరే..!
వచ్చే ఐపీఎల్ సీజన్ (IPL 2026) కోసం ఆటగాళ్లను జట్ల ఫ్రాంచైజీలు ఎన్నుకునేందుకు ఇవాళ అబుదాబీలో నిర్వహిస్తున్న మినీ వేలం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో పలువురు భారత స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా మంచి ధరలకే అమ్ముడుపోతున్నారు. మరోవైపు ఇప్పటికే వారి జాతీయ జట్లలో కొనసాగుతూ మెరుపులు మెరిపిస్తున్న పలువురు దేశ, విదేశీ ఆటగాళ్లకు మాత్రం ఇవాళ్టి వేలంలో షాక్ తప్పలేదు.
ఇవాళ జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లకు కనీస ధర నిర్ణయించారు. కోటి, రెండు కోట్లు ఇలా కనీస ధర పెట్టినా సరే పలువురు క్రికెటర్లు వేలంలో అమ్మడుపోలేదు (unsold). వీరిని తీసుకునేందుకు ఏ జట్టు కూడా ముందుకు రాకపోవడంతో అన్ సోల్డ్ గా ప్రకటించారు. దీంతో వీరిని తదుపరి దశలో ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం తొలి సెషన్ లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్ల జాబితా ఓసారి చూద్దాం..

ఇవాళ ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్ల జాబితాలో ఆస్టేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, న్యూజీలాండ్ ఆల్ రౌండర్ , భారత సంతతికే చెందిన రచిన్ రవీంద్ర, భారత బ్యాటర్ పృధ్వీషా, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, అలాగే దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్, మరో భారత ఆటగాడు దీపక్ హుడా వంంటి వారు ఉన్నారు. వీరంతా కనీస ధరలు పెట్టినా అమ్ముడు కాకపోవడం వెనుక జట్టు కూర్పు, ధర, ఇతర అంశాలు కూడా కారణాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వేలంలో వీరికి నిరాశ తప్పడం లేదు.
స్పిన్నర్లు రాహుల్ చాహర్ కోటి రూపాయలు, మహీష్ తీక్షణ 2 కోట్లు, ఆప్ఘన్ సిన్నర్ ముజీబ్ రెహ్మాన్ 2 కోట్లు, భారత ఆటగాళ్లు అధర్వ తైడే 30 లక్షలు, అన్మోల్ ప్రీత్ సింగ్ 30 లక్షలు, అభినవ్ తేజ్ రాణా 30 లక్షలు, అభినవ్ మనోహర్ 30 లక్షలు, యష్ ధల్ 30 లక్షలు, ఆర్యా దేశాయ్ 30 లక్షలు కనీస ధరలకు పెట్టినా ఎవరూ కొనుగోలు చేయలేదు.అలాగే డాసున్ షణక, బెన్ డ్వార్షెయిస్, సియాన్ అబాట్, మైకేల్ బ్రేస్ వెల్, కర్ణ్ శర్మ, కైల్ జేమీసన్, జోష్ ఇంగ్లిష్, ఆడం మిల్నే కూడా అన్ సోల్డ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications