T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..!

టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ను న్యూజీలాండ్ ఎదుర్కోనుంది. గతంలో జరిగిన మూడు ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్ ను ఓడించిన న్యూజీలాండ్ ఈసారి కూడా ఆతిధ్య జట్టుపై పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ క్రమంలో కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన ఓ వ్యాఖ్య భారత ఫ్యాన్స్ కు మంటపుట్టించింది. దీనికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఘాటు కౌంటర్ ఇచ్చాడు.

ఫైనల్ మ్యాచ్ (T20 world cup final) కు ముందు ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా నోరు జారాడు. రేపు అహ్మదాబాద్ స్టేడియంలో తమ ఆటతీరుతో జనం నోళ్లు మూయిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇప్పుడు వాటిని మిస్టర్ కూల్ గా పేరుున్న శాంట్నర్ రిపీట్ చేసాడు. దీంతో వివాదం మొదలైంది. శాంట్నర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు.

Santner vs SKY Key Battle Before Tomorrow s Highly Anticipated T20 World Cup Final

శాంట్నర్ రేపటి మ్యాచ్ పై మాట్లాడుతూ.. ప్రేక్షకులను నిశ్శబ్దం చేయడమే లక్ష్యం. టీ20 క్రికెట్‌లో చాలా వేరియబుల్స్ ఉంటాయి, కొన్నిసార్లు అది చంచలంగా ఉంటుందన్నాడు. మనం అదే విధంగా మన ఆటతో ముందుకెళ్తే మనం మరొక పెద్ద జట్టును టెన్షన్ పెట్టొచ్చంటూ భారత్ గురించి వ్యాఖ్యానించాడు. ఈ ప్రపంచ కప్‌ను స్వదేశంలో గెలిచే విషయంలో భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉందని శాంట్నర్ వ్యాఖ్యానించాడు.

Santner vs SKY Key Battle Before Tomorrow s Highly Anticipated T20 World Cup Final

ఇదే విషయం ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన టీమిండియా కెప్టెన్ సూర్యను ప్రశ్నిస్తే ఘాటుగా జవాబిచ్చాడు. పెద్ద మ్యాచ్‌లకు ముందు ఇటువంటి ప్రకటనలు చేయడం అలవాటుగా మారిందన్నాడు. అందరూ ఒకే మాట చెబుతున్నారు, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటూ సూర్యకుమార్ యాదవ్ సలహా ఇచ్చాడు. భారత జట్టు స్వదేశంలో ప్రపంచ కప్ ఫైనల్ ఆడే సందర్భాన్ని ఆస్వాదిస్తోందని, డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్ల మానసిక స్థితి చాలా సానుకూలంగా ఉందని స్కై తెలిపాడు. ఇప్పటికే ఒక మ్యాచ్ మినహా టోర్నీలో అన్ని మ్యాచ్ లూ గెలిచి ఫైనల్ ముంగిట నిలిచిన భారతే టైటిల్ ఫేవరెట్ అని ఇప్పటికే అందరూ తేల్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+