Mohammed Siraj : ఐసీసీ ర్యాంకుల్లో మళ్లీ నంబర్ వన్ గా సిరాజ్-ఆసియాకప్ ఫైనల్ మ్యాజిక్ తో..

తాజాగా శ్రీలంకలో ముగిసిన ఆసియాకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత్ కు ఒంటిచేత్తో టైటిల్ అందించిన హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటాడు. ఇవాళ ప్రకటించిన ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో సిరాజ్ అగ్రస్ధానంలో నిలిచాడు. గతంలోనూ అగ్రస్ధానంలోకి వచ్చిన సిరాజ్.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆసియాకప్ ప్రదర్శనతో సిరాజ్ కు తిరిగి నంబర్ వన్ స్ధానం దక్కింది.

అక్టోబర్ 5నుంచి భారత్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకుల్లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ బౌలర్ ర్యాంక్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఆసియాకప్ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టులో సిరాజ్ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ 21 పరుగులకే 6 వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక కేవలం 50 పరుగులకే చాపచుట్టేసింది.

Mohammed Siraj regains No.1 bowler spot in ICC ODI Rankings after magic spell in asia cup final

గతేడాది ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న సిరాజ్.. ఈ ఏడాది మార్చిలో జోష్ హేజిల్‌వుడ్ కు దాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆసియాకప్ లో సూపర్ ప్రదర్శనతో తిరిగి నంబర్ 1 స్ధానానికి చేరుకున్నాడు. సిరాజ్ ఆసియాకప్ టోర్నీని 12.2 సగటుతో, 10 వికెట్లతో ముగించాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సిరాజ్.. ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లను వెనక్కి నెట్టి నంబర్ 1కు చేరుకున్నాడు. ఐసీసీ తాజా బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కూడా తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకుని వరుసగా నంబర్ 4, నంబర్ 5 స్ధానాల్లో నిలిచారు.

భారత ఉపఖండపు పిచ్ లపై జరిగిన ఆసియాకప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్ .. వచ్చే నెలలో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ పై అంచనాల్ని పెంచేశాడు. ప్రస్తుతం భారత పిచ్ లపై అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్ అందుకోవడం కష్టం కాకపోవచ్చు. ఇప్పటికే బ్యాట్స్ మెన్ విశేషంగా రాణిస్తున్న నేపథ్యంలో సిరాజ్ బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా మారబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+