Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆసియాకప్ ట్రోఫీ ఇచ్చేస్తా కానీ.. ! భారత్ కు పీసీబీ ఛీఫ్ షాకింగ్ కండిషన్..!

దుబాయ్ లో జరిగిన ఆసియాకప్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. ఏసీసీ ఛీఫ్, పీసీబీ ఛీఫ్, పాకిస్తాన్ మంత్రి కూడా అయిన మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. దీంతో ట్రోఫీ ఆయన వద్దే ఉండిపోయింది. ఆ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకుని నక్వీ హోటల్ రూమ్ కు వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఇవన్నీ ఆయన వద్దే ఉన్నాయి. దీంతో ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నక్వీపై ఒత్తిడి పెరిగిపోతోంది.

ఆసియాకప్ ట్రోఫీ గెల్చుకున్న భారత్.. ట్రోఫీ తీసుకోకుండానే సంబరాలు చేసేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆసియాకప్ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయిన ఏసీసీ ఛీఫ్ మొహసిన్ నక్వీ దాన్ని ఇప్పుడు భారత్ కు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే దానికి ఓ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి అంగీకరిస్తే ట్రోఫీని, మెడల్స్ ను టీమిండియా ఆటగాళ్లకు ఇచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం.

Mohsin Naqvi Sets Condition for Presenting Asia Cup Trophy and Medals to Team India

ఆసియాకప్ ట్రోఫీని గెల్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇతర క్రికెటర్లు ఓ అధికారిక కార్యక్రమంటు చేస్తేనే వారికి పతకాలు అందిస్తామని ఏసీసీ ఛీఫ్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.అక్కడ వారికి ట్రోఫీ మరియు పతకాలను అందజేసే అవకాశం ఇస్తామని నఖ్వీ నిర్వాహకులకు తెలియజేసినట్లు క్రిక్ బజ్ వెబ్ సైట్ నివేదిక చెబుతోంది. అయితే, భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అలాంటి ఏర్పాటు జరిగే అవకాశం లేదని అర్దమవుతోంది.

Mohsin Naqvi Sets Condition for Presenting Asia Cup Trophy and Medals to Team India

ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. పాకిస్తాన్ మంత్రి అయిన ఏసీసీ ఛైర్మన్ నుంచి ఆసియాకప్ ట్రోఫీ తీసుకోకూడదని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాబట్టి తాము అతని నుండి దీన్ని తీసుకునే అవకాశం లేదన్నారు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుందన్నాు. అంటే దీనర్దం ఆ పెద్దమనిషి పతకాలతో పాటు ట్రోఫీని కూడా తనతో తీసుకెళ్లిపోతాడని కాదన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, క్రీడాస్ఫూర్తి లేకపోవడమేనని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+