Pakistan Super 8: పాక్ గెలవక తప్పని పోరు..! ఓడితే అమెరికాకు బెర్త్?

టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 (Super 8) బెర్తులు దాదాపు ఖరారయ్యాయి. మొత్తం 8 బెర్తుల్లో ఏడు బెర్తులు ఖరారైపోయాయి. ఇక మిగిలిన చివరి బెర్తు కోసం పాకిస్తాన్ (Pakistan) ఇవాళ నమీబియాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. పాయింట్ల ఆధారంగా నేరుగా సూపర్ 8లోకి అడుగుపెట్టాలంటే గెలవక తప్పని పోరు పాకిస్తాన్ కు ఎదురవుతోంది. ఇందులో ఓడితే అమెరికాతో నెట్ రన్ రేట్ లో పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం.

గ్రూప్ ఏలో భాగంగా ఉన్న నమీబియా ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. అయితే భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్ ఉన్న ప్రస్తుత పరిస్ధితుల్లో నమీబియాతో పోరు కూడా ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. గతంలో రెండు వరల్డ్ కప్ లలో తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 8కు చేరుకోకపోతే ఇది హ్యాట్రిక్ కాబోతోంది. ఇది పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి పెంచే అంశం.

T20 World Cup Pakistan s Super 8 Fate Rests on Do-or-Die Clash with Namibia Today

భారత్ తో మ్యాచ్ లో దారుణ ఓటమి తర్వాత జట్టులో పేసర్ షహీన్ అఫ్రిది, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం స్ధానాలకు ముప్పు పొంచి ఉంది. వీరి స్ధానాల్లో నసీమ్ షా, ఖవాజా నఫాయ్, అలాగే మరో ఫెయిల్యూర్ ఆల్ రౌండర్ షాదాబ్ స్ధానంలో ఫఖర్ జమాన్ వచ్చే అవకాశం ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. ప్రేమదాస స్టేడియంతో పోలిస్తే ఇక్కడి వికెట్ కాస్త పేసర్లకు అనుకూలిస్తుంది. 2021 టీ20 వరల్డ్ కప్ లో నమీబియాపై 189 పరుగులు చేసిన పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో తిరిగి అమెరికాపై చేసిన 190 పరుగులే హయ్యస్ట్. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారీగా పరుగులు చేసేందుకే పాక్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+