Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup: వీవర్ షిప్ లో సరికొత్త రికార్డు..! టాప్ మ్యాచ్ ఇదే ..!

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) నాకౌట్ దశకు చేరుకుంది. ఇవాళ దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్, రేపు భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగబోతున్నాయి. ఈ నెల 8న ఫైనల్ జరుగుతుంది. అయితే ఈ టోర్నీకి ప్రేక్షకాదరణ గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో పతాకస్థాయికి చేరుకుంది. గతంలో జరిగిన ఏ టీ20 వరల్డ్ కప్ కూ లేనంత స్ధాయిలో అత్యధిక మంది ఈ మెగా టోర్నీని చూశారు.

ఈసారి టీ20 వరల్డ్ కప్ ను వీక్షించిన వారి సంఖ్య 500 మిలియన్లు దాటిపోయింది. ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటితో ఈ సంఖ్య 600 మిలియన్లను టచ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఈ వివరాల్ని ఐసీసీ అధ్యక్షుడు జై షా స్వయంగా ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ ప్రయాణం ఇప్పటివరకు అత్యంత గ్లోబల్ & యాక్సెస్బుల్ క్రికెట్ ఈవెంట్‌గా మార్చాలనే ఆశయంతో ప్రారంభమైందని ఆయన తెలిపారు. భారతదేశంలో ఈ ఈవెంట్‌కు వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు దాటిందని నేను వినయంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇది చరిత్రలో ఏ టీ20 ప్రపంచ కప్‌కైనా అత్యధికం అన్నారు.

T20 World Cup 2026 Sets Record with 500 Million Views Which Match Was the Most Watched

అలాగే జియో హాట్ స్టార్ లో లైవ్ లో వీక్షకులు 60.5 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం కూడా ఉత్సాహాన్నిచ్చిందని జై షా తెలిపారు. ఈ రాత్రి ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం నాకౌట్ మ్యాచ్‌లతో, భారతీయ అభిమానుల నుండి మా ఈవెంట్‌లకు లభించే అపారమైన ప్రేమ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. జై షా ట్వీట్ కు రిప్లై గా ఈ టోర్నీలో అత్యధిక ప్రేక్షకాదరణ లభించిన మ్యాచ్ ఏదని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ అని సమాధానం ఇచ్చింది. ఈ మ్యాచ్ ను ఏకంగా 510 మిలియన్ల ప్రేక్షకులు చూశారట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+