Praful Hinge: బుడ్డోడినే గోల్డెన్ డకౌట్ చేసాడు.. ఎవరీ SRH నయా పేసర్..?
జస్ప్రీత్ బుమ్రా.. కగిసో రబాడ, జోష్ హాజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ల బౌలింగ్‌లో తొలి బంతినే బౌండరీకి పంపించి ప్రమాదకరంగా మారిన రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఓ అనామక పేసర్ గోల్డెన్ డకౌట్ చేశాడు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను చెడుగుడు ఆడిన సిక్సర పిడుగును అరంగేట్ర పేసర్ తన రెండో బంతికే పెవిలియన్ చేర్చాడు. ఆ యంగ్ సెన్సేషన్ ఎవరో కాదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా పేస్ గన్ ప్రఫుల్ హింగే.
ఐపీఎల్ 2026 సీజన్లోనే బలహీనమైన బౌలింగ్ కలిగిన జట్టుగా ముద్ర పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతాడని, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు బడిత పూజేనన్న వారి నోర్లను ప్రఫుల్ హింగే మూయించాడు. వైభవ్‌నే కాదు.. ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‌లను ఔట్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే తన ఫస్ట్ ఓవర్లోనే మూడు వికెట్లు తీసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. తన రెండో ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(4)ను కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. దాంతో ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఎవరీ SRH నయా పేసర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన 24 ఏళ్ల ప్రఫుల్ హింగే.. అందరిలానే ఇంటి పక్కన ఉన్న మైదానంలో క్రికెట్ జర్నీని ప్రారంభించాడు. చదవులో కాస్త వీక్ అయిన ప్రఫుల్ హింగేను క్రికెట్ ఆడకుండా అతని తండ్రి అడ్డుకున్నాడు. చదవుపై ఫోకస్ పెట్టాలని మందలించేవాడు. కానీ అతని 12వ ఏట నిర్వహించిన ఓ సమ్మర్ క్యాంప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో తండ్రి అడ్డు చెప్పలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రోత్సహించాడు.
13 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ హింగే పూర్తి స్థాయి బౌలర్‌గా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. అండర్-19 ట్రయల్స్‌లో ప్రఫుల్ హింగే 36 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. విదర్భ దేశవాళీ జట్టు తరపున ఆడుతున్న ప్రఫుల్ హింగే.. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. విదర్భ ప్రో టీ20 లీగ్‌లోనూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టు తరపున 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి తన టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రఫుల్ బౌలింగ్‌కు వరుణ్ ఆరోన్ ఫిదా..
గతేడాది తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో విదర్భ తరఫున ప్రఫుల్ ఐదు వికెట్లతో సత్తా చాటడం చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్.. అతన్ని ట్రయల్స్‌కు ఆహ్వానించాడు. SRH ట్రయల్స్‌లో ప్రఫుల్ సత్తా చాటడంతో ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేశారు.
వాస్తవానికి ప్రఫుల్ హింగే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే అరంగేట్రం చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో పిచ్ స్లోగా ఉందని అతన్ని పక్కనపెట్టి జయదేవ్ ఉనాద్కత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించారు. కానీ అతను దారుణంగా విఫలమవడంతో సన్‌రైజర్స్ ప్రఫుల్ హింగేకు అవకాశం ఇచ్చింది. అతను ఈ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.
-
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
IPL 2026: బోణీ కొట్టిన చెన్నై.. మ్యాచ్ మలుపు తిరిగిందక్కడే! -
Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!! -
బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
ఆయన వల్లే ఈ సెంచరీ.. నా లక్కీ ఛార్మ్: సంజూ శాంసన్ -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!! -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
ఎంత సీఎం అయినా.. !!











Click it and Unblock the Notifications