• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిఎన్జీవో సభ: తొడ కొట్టడాలు, ఉద్రిక్తం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒకవైపు ఎపిఎన్జీవోల సభ.. మరోవైపు సభను అడ్డుకునేందుకు తెలంగాణవాదుల మోహరింపుతో హైదరాబాద్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. స్టేడియం వద్ద ఐదు అంచెల భద్రతతో పాటు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో బారికేట్లు పెట్టారు. సభ జరుగుతున్న ప్రాంతానికి ర్యాలీలుగా బయలుదేరిన తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో ఓయూ, నిజాం హాస్టల్ వద్ద విద్యార్థులు, పోలీసులు నేరుగా తలపడ్డారు.

ఉస్మానియాలో బాష్పవాయువును ప్రయోగించగా, నిజాం హాస్టల్‌లో విద్యార్థి నేతలు బాల్క సుమన్ తదితరులను అరెస్టు చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను ఐదు గంటల పాటు అదుపులోకి తీసుకోగా, పోలీస్ ఆంక్షలను ధిక్కరించి ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్, ప్రజాఫ్రంట్, అరుణోదయ, న్యూ డెమోక్రసీ కార్యకర్తలను పలుచోట్ల అరెస్టు చేశారు.

స్టేడియం వద్దకు చేరుకున్న కొందరు తెలంగాణవాదుల, సభ బయట, లోపల తెలంగాణ నినాదాలు చేసి హల్‌చల్ సృష్టించారు. సభ పూర్తయి వెనక్కి పోతున్న సీమాంధ్ర ఉద్యోగుపై, బస్సులపై గన్‌పార్కు సహా పలుచోట్ల రాళ్లు రువ్వారు. ఎపిఎన్జీవోల సభను అడ్డుకునేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు నిలువరించడంతో ఓయు అట్టుడికింది. ఎన్‌సిసి దాటి విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు రెండంచెల్లో బారికేట్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు.

సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేశ్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సీమాంధ్ర ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరం ఘర్షణ పడ్డారు. విద్యార్థులు రాళ్లు రువ్వగా, పోలీసులు తొలుత రబ్బర్ తూటాలను అనంతరం బాష్ప వాయు ప్రయోగం జరిపారు. బారి కేట్లను తొలగించడానికి ప్రయత్నించిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఎల్బీ స్టేడియంలో రెండు మూడు ఘటనలు జరిగాయి. నిజాం కళాశాల వద్ద విద్యార్థులు, పోలీసులకు మధ్య జరిగిన ఉద్రిక్తతలో బాలరాజ్ యాదవ్, కుమార్ సాగర్, హరిబాబు అనే ముగ్గురు ఓయూ జెఏసి విద్యార్థులు గాయపడ్డారు. నిజాం కళాశాల వద్ద కోదండరాం తదితరులను అరెస్టు చేశారు. ఎపిఎన్జీవోల సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సభను జరగనీయబోమని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ నేరుగా సభ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ముఖ్యమంత్రి కిరణ్ దిష్టిబొమ్మను తగలబెట్టగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విమలక్క నేతృత్వంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన అరుణోదయ కళాకారులను అరెస్టు చేసి గాంధీనగర్ స్టేషన్‌కు తరలించారు.

తొడకొడుతున్న దృశ్యం

తొడకొడుతున్న దృశ్యం

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ శనివారం నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కార్యకర్త తొడకొడుతున్న దృశ్యం.

పీక్ కోస్తా

పీక్ కోస్తా

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ శనివారం నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కార్యకర్త పీక కోస్తా అంటూ హెచ్చరిస్తున్న దృశ్యం.

కానిస్టేబుల్ జై తెలంగాణ

కానిస్టేబుల్ జై తెలంగాణ

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభా వేదిక ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్.

ఆదుపులోకి

ఆదుపులోకి

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభా వేదిక ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్. అతనిని కొట్టేందుకు లాఠీ ఎత్తిన తోటి పోలీసు.

మరొకరు తోడు

మరొకరు తోడు

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభా వేదిక ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని కొట్టబోగా మరో పోలీసు కానిస్టేబుల్ జై తెలంగాణ అంటూ అతనికి మద్దతుగా నిలబడిన దృశ్యం.

అదుపులోకి

అదుపులోకి

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభా వేదిక ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న దృశ్యం.

రక్తం కారుతూ..

రక్తం కారుతూ..

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి గాయం కావడంతో పోలీసులు తీసుకు వెళ్తున్న దృశ్యం.

కొడుతున్న దృశ్యం

కొడుతున్న దృశ్యం

హైదరాబాదులోని ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ వద్ద నినాదాలు చేసిన వ్యక్తిని కొడుతున్న దృశ్యం.

బాలరాజు యాదవ్‌కు తెరాస పరామర్శ

బాలరాజు యాదవ్‌కు తెరాస పరామర్శ

నిజాం కళాశాల వద్ద జరిగిన దాడిలో గాయపడ్డ ఓయు ఐకాస నాయకుడు బాలరాజు యాదవ్‌ను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.

పరామర్శ

పరామర్శ

నిజాం కళాశాల వద్ద జరిగిన దాడిలో గాయపడ్డ ఓయు ఐకాస నాయకుడు బాలరాజు యాదవ్‌ను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి, ఉద్యోగ సంఘ నేతలు.

దాడి

దాడి

నిజాం కళాశాల వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు బాలరాజు యాదవ్ పైన దాడి చేస్తున్న దృశ్యం.

చికిత్స

చికిత్స

నిజాం కళాశాల వద్ద జరిగిన దాడిలో గాయపడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు బాలరాజు యాదవ్‌కు చికిత్స

దాడి

దాడి

నిజాం కళాశాల వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు బాలరాజు యాదవ్ పైన దాడి చేస్తున్న దృశ్యం.

అదుపులోకి

అదుపులోకి

నిజాం హాస్టల్ వద్ద ఎపిఎన్జీవో సభకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి

అదుపులోకి

నిజాం హాస్టల్ వద్ద ఎపిఎన్జీవో సభకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పహారా

పహారా

ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో నిజాం కళాశాల వద్ద పోలీసుల పహారా దృశ్యం. నిజాం కళాశాల విద్యార్థులు ర్యాలీకి యత్నించారు.

హాస్టల్ పై నుండి జై తెలంగాణ

హాస్టల్ పై నుండి జై తెలంగాణ

ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో దానిని నిరసిస్తూ నిజాం కళాశాల భవనం పైకెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న విద్యార్థులు.

జై తెలంగాణ

జై తెలంగాణ

జై తెలంగాణ, పోలీసులను రానివ్వకండి, మీడియాను లోనికి అనుమతించాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్న ఓ విద్యార్థి.

ఓయులో..

ఓయులో..

ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ర్యాలీ తీస్తున్న దృశ్యం.

పోలీసులతో వాగ్వాదం

పోలీసులతో వాగ్వాదం

ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం.

దిష్టిబొమ్మ దగ్ధం

దిష్టిబొమ్మ దగ్ధం

ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు.

పోలీసు ఫైరింగ్

పోలీసు ఫైరింగ్

ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ర్యాలీని అడ్డుకొని బాష్పవాయు ప్రయోగిస్తున్న పోలీసులు.

తెరాస దీక్ష

తెరాస దీక్ష

అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న దృశ్యం. చిత్రంలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు.

ఎమ్మార్పీఎస్ అరెస్ట్

ఎమ్మార్పీఎస్ అరెస్ట్

ఎపిఎన్జీవో సభను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం. కార్యకర్త జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు.

టిపిఎఫ్ అరెస్ట్

టిపిఎఫ్ అరెస్ట్

ఎపిఎన్జీవో సభను అడ్డుకునేందుకు వచ్చిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, టిపిఎఫ్, తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిపిఎఫ్ కార్యకర్తను అరెస్టు చేస్తున్న దృశ్యం.

విమలక్క అరెస్ట

విమలక్క అరెస్ట

ఎపిఎన్జీవో సభను అడ్డుకునేందుకు వచ్చిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, టిపిఎఫ్, తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమలక్కను అరెస్టు చేస్తున్న దృశ్యం.

టిజెఏసి

టిజెఏసి

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎపిఎన్జీవోల సభపై విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి, టిఎన్జీవో నేతలు మాట్లాడారు.

English summary
Describing Saturday's APNGO's rally at an assult on Hyderabad and the egions, pro Telangana parties said the government sponsored meet had divided the people of the two regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X