స్వాతి హత్య కేసులో ట్విస్ట్: ధనుష్ సినిమాలు ప్రేరణ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని రాంకుమార్ హత్య చేయడానికి ప్రేరణ రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ సినిమాలు అనే ప్రచారం సాగుతోంది. ఈ విధమైన అభిప్రాయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా తన తన వ్యక్తిత్వాన్ని కించపరిచిందనే ఉద్దేశంతో స్వాతిని హత్య చేసినట్టు నిందితుడు రాంకుమార్ తొలుత చెప్పిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత రామ్ కుమార్ తన మాట మార్చాడు. తాను అమాయకుడ్ననని కోర్టు ముందు చెప్పాడు. అది ఎలా ఉన్నా, ఇప్పుడు ధనుష్ సినిమాలు మాత్రం అతని వల్ల చర్చలోకి వచ్చాయి. రామ్ కుమార్ జీవనశైలి, ప్రవర్తన ధనుష్ సినిమాల్లోని పాత్రల్లానే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

Dhanush films influence behind Swathi murder?

ధనుష్ సినిమాల్లోని పాత్రల్లాగే రామ్ కుమార్ స్వాతి పట్ల ప్రవర్తించాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమిళంలో వైరల్ అవుతున్నాయి.ధనుష్‌ సినిమాలతో ప్రేరణ పొందడం వల్లే రాంకుమార్ స్వాతిని హత్య చేశాడా అని తమిళులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ధనుష్ నటించిన చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లను వెంటపడి వేధిస్తుంటాయని, ఆట పట్టిస్తుంటాయని అంటున్నారు. ధనుష్ పాడిన 'కొలవరి ఢీ' పాటలో కూడా నల్ల అబ్బాయి తెల్ల అమ్మాయికి ప్రేమ ప్రతిపాదన చేస్తాడు. అయితే ఆమె తిరస్కరిస్తే పరిస్థితి ఎంతటి దీనంగా ఉంటుందనేది అందులో చూపించారు.

అది ఎంత వరకు నిజమో గానీ, సినిమాలు యువతను ప్రభావితం చేస్తాయనేది పలు సందర్భాల్లో తేలిన విషయమే. సినిమాలు చూసి దొంగతనాలు చేసిన సంఘఠనలు కూడా బయటపడడం గతంలో చూశాం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Netizens are blaming Dhanush's films for Ram Kumar's act in Infosys techie murder in Salem district of Tamil Nadu

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి