వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత పైన ఎన్నో కేసులు, జైల్లో నిద్ర లేకుండా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న జయలలిత పైన చాలా కేసులు ఉన్నాయి. అక్రమార్జన, ఆశ్రితపక్షపాతం, నిబంధనల ఉల్లంఘన.. ఇలా పలు కేసులు ఉన్నాయి.

అందులో కొన్ని కేసుల నుండి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు విముక్తి లభించగా, మరికొన్ని కేసుల్లో విచారణలు కొనసాగుతున్నాయి.

 జయలలిత - కలర్ టెలివిజన్ల

జయలలిత - కలర్ టెలివిజన్ల

1995లో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు అందజేయటం కోసం ప్రభుత్వం 45వేలకు పైగా కలర్ టీవీలను కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టి.. ఓపెన్ టెండర్ విధానం లేకుండా పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.75 కోట్ల విలువైన కొనుగోలులో రూ.10 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఛార్జీషీటు దాఖలైంది. 1996లో జయ ఈ కేసులో అరెస్టయ్యారు. 2000లో ప్రత్యేక కోర్టులో ఆమెకు ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు 2009లో జయను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది.

 జయలలిత - టాన్సీ భూములు

జయలలిత - టాన్సీ భూములు

తమిళనాడు చిన్న పరిశ్రమల కార్పోరేషన్ (టాన్సీ) నుండి జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ ప్రైజెస్ అనే రెండు సంస్థలు భూములు కొన్నాయి. ఈ సంస్థల్లో జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ భాగస్వాములు. ఈ సంస్థలకు టాన్సీ చాలా తక్కువ ధరకు భూములను విక్రయించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.3కోట్ల నష్టం కలిగిందనే ఆరోపణ ఉంది. చెన్నై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. జయ పబ్లికేషన్స్ కేసులో జయకు, శశికళకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

జయలలిత - టాన్సీ భూములు

జయలలిత - టాన్సీ భూములు

శశి ఎంటర్ ప్రైజెస్ కేసులో కూడా వీరిద్దరికి మరో రెండేళ్ల శిక్ష పడింది. జయను దోషిగా నిర్ధారిస్తూ 9 అక్టోబర్ 2000న ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీంతో మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పాల్గొనే అర్హత ఆమెకు లేకుండా పోయింది. అయినప్పటికీ అసెంబ్లీలో మెజార్టీ సాధించిన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను నేతగా ఎన్నుకున్నారు. జయ సీఎం పదవి చేపట్టారు. కానీ, సుప్రీం జోక్యంతో 21 సెప్టెంబర్ 2001 సీఎం పదవి నుండి వైదొలిగారు. అనంతరం మద్రాస్ హైకోర్టు ఆరోపణలు కొట్టివేసింది. సుప్రీం ఆ తర్వాత హైకోర్టు తీర్పును సమర్థించింది.

 జయలలిత - ప్లెజెంట్ స్టే హోటల్

జయలలిత - ప్లెజెంట్ స్టే హోటల్

కొడైకెనాల్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ప్లెజెంట్ స్టే అనే హోటల్‌కు ఏడు అంతస్తుల వరకు నిర్మించారు. తొలి ఐదంతస్తులను బేస్‌మెంట్‌గా పేర్కొని ఆరవ అంతస్తును గ్రౌండ్ ఫ్లోర్‍గా, ఏడవ అంతస్తును ఫస్ట్ ఫ్లోర్‌గా పేర్కొన్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టకుండా.. భవన నిర్మాణ నిబంధనలను జయ సవరించారు. ఈ కేసులో 1997లో ఛార్జీషీటు దాఖలైంది. 2000లో ఈ కేసులో జయను దోషిగా నిర్ధారిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకోగా 2001లో జయను నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

జయలలిత - గ్రానైట్ క్వారీ

జయలలిత - గ్రానైట్ క్వారీ

గ్రానైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ భూములను లీజుదారులకు లీజు సొమ్ము తీసుకోకుండానే అప్పగించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.పన్నెండు కోట్ల నష్టం వాటిల్లింది. మూడు లక్షల డాలర్ల బహుమతి స్వీకరణ కేసులో విచారణను హైకోర్టు 2011లో నిలిపివేసింది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయని కేసులో జయ, శశికళల మీద చెన్నైలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.

జయలలిత - బొగ్గు దిగుమతులు

జయలలిత - బొగ్గు దిగుమతులు

1992లో తమిళనాడు విద్యుత్ బోర్డుకు అవసరమైన బొగ్గు దిగుమతుల విషయంలో బొగ్గు సరఫరాదారులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరఫరాదారుల నుండి భారీ ఎత్తున సొమ్ము తీసుకొని వారికి లాభం కలిగేలా ప్రభుత్వ పెద్దలు పావులు కదిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఖజానాకు రూ.ఆరున్నర కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో జయ, మంత్రులు, పలువురు అధికారులను నిందితులుగా చేర్చారు. 2001లో జయ ఈ కేసు నుండి బయటపడ్డారు.

జయలలిత - బొగ్గు దిగుమతులు

జయలలిత - బొగ్గు దిగుమతులు


1996లో జయలలిత అధికారం కోల్పోయిన అనంతరం ఆమె నివాసం పైన ఇంటెలిజెన్స్, అవినీతి నిరోధక అధికారులు దాడులు చేశారు. ఆరు రోజులు సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 28 కిలోల బంగారు ఆభరణాలు, 91 చేతి గడియారాలు, 41 ఏసీలు, 10,500 చీరలు, 750 చెప్పుల జతలు, స్థిరాస్థులకు సంబందించిన చాలా పత్రాలు దొరికాయి.

 జయలలిత జైలులో...

జయలలిత జైలులో...

జయలలితకు శనివారం రాత్రి బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో కంటి మీద కునుకు లేదట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితను పోలీసులు శనివారం సాయంత్రం జైలుకు తరలించారు. జైలులోని 23వ నెంబరు గదిలో ఒంటరిగానే జయలలిత రాత్రంతా గడిపినట్లుగా తెలుస్తోంది. తీర్పు వెలువడగానే అస్వస్థతకు గురైన జయలలితను తొలుత ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు అనంతరం ఆమెను జైలుకు తరలించారు.

English summary
Even before the final verdict is announced, media reports have gone abuzz with news that Jayalalithaa has been found guilty in the infamous disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X