వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా నదీజలాలు: ఆరని చిచ్చు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంచినీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెరో 13 టీఎంసీల నీరు కేటాయిస్తూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. గురువారం ఇక్కడ బోర్డు పూర్తి స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా బోర్డు చైర్మన్‌, ఏపీ అధికారులు, తెలంగాణ అధికారుల మధ్య రెండుమూడు సార్లు వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. చివరకు రెండు రాష్ర్టాల అధికారులు సర్దుకుపోవడంతో సమావేశం సజావుగా ముగిసింది. బోర్డు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ అధ్యక్షుడు ఎ.బి.పాండ్య సమావేశానికి అధ్యక్షత వహించారు.

రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు బి.అరవిందరెడ్డి, ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, ఎం.వెంకటేశ్వరరావులతోపాటు సీఈ లు, కేంద్ర విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు. రెండు రాష్ర్టాల తాగునీరు, ఖరీఫ్‌ అవసరాలు సహా బోర్డు యంత్రాంగం, నిధులు, సెక్యూరిటీ తదితరాలపై లోతుగా చర్చించారు.

సమావేశం నిర్ణయాలు

సమావేశం నిర్ణయాలు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 26 టీఎంసీలు తాగునీటికి కేటాయింపు. శీశైలం ఎండీడీఎల్‌ (834 అడుగులు) దిగువ నుంచి నీటి విడుదల; తెలంగాణలోని ఏఎంఆర్పీకి 3 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వకు 10 టీఎంసీలు కేటాయింపు; ఏపీలోని కృష్ణా డెల్టాకు 3 టీఎంసీలు, సాగర్‌ కుడికాల్వకు 10 టీఎంసీలు; ముందుగా ఏఎంఆర్పీ, కృష్ణా డెల్టాలకు తాగునీటి విడుదలపై సాగర్‌ సీఈకి ఆదేశాలు; సాగర్‌ కుడి, ఎడమ కాల్వల నుంచి తాగునీటి విడుదలపై వారం తర్వాత నిర్ణయం.

సమావేశం నిర్ణయాలు

సమావేశం నిర్ణయాలు

సాగర్‌ ఎడమ కాల్వ కింద కృష్ణా జిల్లాకు 65ః35 నిష్పత్తిలో తాగునీటి విడుదలపై బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలి. కృష్ణా డెల్టాకు ఖరీఫ్‌ కోసం సాగునీటి విడుదలపై శ్రీశైలంలోకి వరద నీరు చేరిన తర్వాతే నిర్ణయం; ప్రస్తుత నిల్వకు అదనపు నీరొస్తే నీటి విడుదల.

సమావేశం నిర్ణయాలు

సమావేశం నిర్ణయాలు

తాగు, సాగునీటి విడుదలపై ప్రొటోకాల్‌ తయారీకి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, రెండు రాష్ర్టాల ఈఎన్‌సీలతో ఉప కమిటీ ఏర్పాటు. వివిధ అంశాలపై అధ్యయనం తర్వాత కమిటీ సిఫారసులు చేస్తుంది. బోర్డులోకి రెండు రాష్ర్టాల సిబ్బందిని తీసుకుంటే ప్రోత్సాహకం ఎలా ఉండాలో కూడా కమిటీ నిర్ణయిస్తుంది. దీనిపై బోర్డుదే తుది నిర్ణయం.

సమావేశం నిర్ణయాలు

సమావేశం నిర్ణయాలు

కృష్ణాపై ఏయే ప్రాజెక్టులకు బోర్డు అధికార పరిధి వర్తింపజేయాలన్నదానిపై కేంద్రం ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇస్తుంది. దీనిపై రాష్ర్టాలు తమ అభిప్రాయాలను జలవనరుల మంత్రిత్వ శాఖకు తెలపాలి. జూరాల, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్‌ కుడి- ఎడమ కాల్వల నిర్వహణ, మరమ్మతులను బోర్డు చేపడుతుంది. ఇందుకయ్యే వ్యయాన్ని రాష్ర్టాలు వాటి ఆయ కట్టు, నీటి వినియోగాన్ని బట్టి భరించాలి.

మార్గదర్శకాలు

మార్గదర్శకాలు

-కృష్టానదిపై ఉన్న జల విద్యుదుత్పత్తి ప్రాజుక్టులను బోర్డు పరిధిలోకి తేవడం.., ప్రకాశం, సుంకేశుల బ్యారేజీలను కేవలం పర్యవేక్షణ కోసమే బోర్డు పరిధిలోకి తేవచ్చా?

వాదోపవాదాలు

వాదోపవాదాలు

అరవిందరెడ్డి: కృష్ణా డెల్టాకు అదనంగా 3.6 టీఎంసీల నీటి విడుదల ఏకపక్ష నిర్ణయం. మమ్మల్ని సంప్రదించకుండా ఎలా చేస్తారు? తాగునీటికి కావాల్సింది 3 టీఎంసీలే. మిగిలిన నీటిని నారుమళ్ల కోసం వాడుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు ఇమ్మంటున్నారు. దీనికి మేం అంగీకరించం. మాకూ 3 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వకు 10 టీఎంసీలు కావాలి.

వాదోపవాదాలు

వాదోపవాదాలు

బోర్డు చైర్మన్‌ పాండ్య: మీరు మాట్లాడుతోంది తప్పు. త్వరలో సమావేశం ఉంటుందన్న ఉద్దేశంతోనే, అదీ చట్టం ప్రకారమే నీటి విడుదల కొనసాగించాలని ఆదేశించాను. గవర్నర్‌ వద్ద భేటీలోనే 10 టీఎంసీల విడుదల నిర్ణయం తీసుకున్నారు. అందులో మీరూ పాల్గొన్నారు కదా? కొత్త అవసరాలపైనే బోర్డు నిర్ణయం తీసుకోవాలని ఉంది. దాన్నే అనుసరించాను

ఆదిత్యనాథ్‌ దాస్‌:

ఆదిత్యనాథ్‌ దాస్‌:

దుర్వినియోగం చేస్తున్నామనడం తప్పు. నారుమళ్ల కోసం ఎక్కడా వాడలేదు. ఎక్కడైనా ఒకరిద్దరు రైతులు వాడితే ఎలా అడ్డుకోగలం? సీడబ్ల్యూసీ టీమ్‌ వెళ్లి చూసింది. ఏఎంఆర్పీకి, హైదరాబాద్‌కు తాగునీటికి 350 క్యూసెక్కులు చాలు. కానీ, ఆ పేరిట 900 క్యూసెక్కులు పంప్‌ చేస్తున్నారు. అందుకు బోర్డు అనుమతి ఉందా? మిగులు నీరంతా ఎటు పోతోంది? మీ కు తాగునీరు కావాలంటే అడిగి తీసుకోండి. డెల్టాకు విడుదల వ ల్ల తాగునీరు ఉండటం లేదంటే చెప్పండి.. మా డిమాండ్‌ను స మీక్షించుకుంటాం. ఈ నెలాఖరులో డెల్టా ఖరీఫ్‌కు నీళ్లు కావాలి.

అరవిందరెడ్డి:

అరవిందరెడ్డి:

ఖరీఫ్‌కు నీళ్లివ్వడాన్ని ఒప్పుకోం. మా అవసరాలు పరిగణనలోకి తీసుకున్నాకే పరిశీలించాలి.
బోర్డు చైర్మన్‌: అదెలా కుదురుతుంది? డ్యాం పూర్తిగా నిండితేగానీ కిందకు నీళ్లివ్వబోమంటే ఎలా? దేశంలో ఎక్కడా ఇ లాంటి పద్ధతి లేదు. అందరి అవసరాలను, నీటి లభ్యతను లెక్కించి, ఆ ప్రకారం విడుదల చేయాల్సి ఉంటుంది. శ్రీశైలంలోకి అదనపు నిల్వలు వస్తే కృష్ణా డెల్టా ఖరీఫ్‌కు విడుదలలో ఎలాంటి తప్పు లేదు. మీకూ కావాలంటే అడగండి.

English summary
Krishna water management board met under the chairmanship of Pandya and discussed about the Krishna water release from Nagarjuna Sagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X