సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను చంపి, ఎస్సై ఆత్మహత్య: డైరీ మిస్టరీ వీడుతుందా..

ఎస్సీ చిట్టిబాబు తన భార్యను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన డైరీలో ఏముందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది...

By Pratap
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: భార్యను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక ఎస్సై చిట్టిబాబుకు డైరీ రాసే అలవాటు ఉంది. తన కార్యకలాపాలను డైరీలో నమోదు చేసుకునే అలవాటు అతనికి ఉంది. తనను ఉన్నతాధికారులు వేధించిన తీరును, డైరీలోనూ హ్యాండ్‌బుక్‌లోనూ రాసే ఉంటారని అనుమానిస్తున్నారు.

చిట్టిబాబుకు చెందిన కారులో నలుపు రంగ స్పైరల్ డైరీని ఒకదాన్ని గుర్తించారు. కారు లాక్ చేసి ఉండడంతో శుక్రవారం సాయంత్రం వరకు దాన్ని తీయలేదు. ఆ డైరీని పరిశీలిస్తే కొంత సమాచాం లభించ వచ్చునని అంటున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లనే చిట్టిబాబు ఆ తీవ్రమైన చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.

అయితే ఆ ఆరోపణలను సిద్ధిపేట పోలీసు కమిషన్ శివకుమార్ ఖండిస్తున్నారు. చిట్టిబాబు ఉదంతంపై సీనియర్ అధికారి విచారణ జరుపుతున్నారని, ఆయన ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. కానిస్టేబుల్‌గా 1984లో నియమితుడైన చిట్టబాబుకు 2012లో ఎస్సైగా ప్రమోషన్ వచ్చిందని, 2004లో ఓసారి సస్పెండ్ అయ్యారని ఆయన చెప్పారు.

ఆరు రోజుల క్రితం ఓ క్రైమ్ దర్యాప్తులో భాగంగా సిద్ధిపేటకు అటాచ్ చేశామని, శాఖాపరమైన క్రమశిక్షణ చ్యల్లో భాగంగా మూడు రోజుల క్రితం సస్పెండ్ చేశామని, కానీ చిట్టిబాబు ఆ ఆదేశాలను ఇప్పటి తీసుకోలేదని, ఎస్సైగా విధుల్లోనే ఉన్నారని ఆయన వివరించారు.

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో భార్యను కాల్చి....

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో భార్యను కాల్చి....

గురువారం రాత్రి హైదరాబాదుకు వెళ్లిన చిట్ిబాబు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బార్యతో సహా దుబ్బాకలోని పోలీసు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రెండు గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచంపై నిద్ర పోతున్న భార్య సరోజ (48)ను కణతపై పాయింట్ బ్లాంక్ దూరం నుంచి ముందుగా కాల్చి ఆ తర్వాత తన గదుమ భాగంలో తాను కాల్చుకున్నాడు. మధ్యహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఓ హోంగార్డు చూడడం ద్వారా

ఓ హోంగార్డు చూడడం ద్వారా

మధ్యాహ్నం భోజనం కోసం ఏం తీసుకుని రావాలో అడిగేందుకు ప్రభాకర్ అనే హోంగార్డు ఎస్సీ చిట్టిబాబు క్వార్టర్‌కు వచ్చారు. అప్పటికే నెత్తుటి మడుగులో పడి ఉన్న ఎస్సైని, ఆయన భార్యను చూసి వెంటనే పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బందికి చెప్పారు. పోలీసులు వచ్చేసరికే సరోజ మరణించి ఉంది. చిట్టిబాబు మాత్రం కొనపూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. సిద్ధిపేట సురక్ష, ఆస్పత్రికి తరలిస్తుండగా చిట్టిబాబు మార్గమధ్యలో మరణించారు.

ఆధారాల సేకరణ ఇలా..

ఆధారాల సేకరణ ఇలా..

చిట్టిబాబు ఆత్మహత్యపై కమిషనర్ శివకుమార్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా మెదక్ అదనపు ఎస్పీ రామచంద్రారెడ్డిని నియమించారు. చిట్టిబాబు ఆత్మహత్యకు సంబంధించి సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర రెడడ్ి, మెదక్ అదనపు ఎస్పీ రామచంద్రా రెడ్డి, సిద్ధిపేట రూరల్ సిఐ సైదులు ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. పంచనామా పూర్తయ్యే వకు డిఐడి అకున్ సబర్వాల్ అక్కడే ఉన్నారు. చిట్టిబాబు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటంబ సభ్యులు ఏ విధంగా ఫిర్యాదు చేస్తే ఆ విధంగా కేసు నమోదు చేస్తామని సబర్వాల్ చెప్పారు.

అందుకే ఆత్మహత్యనా....

అందుకే ఆత్మహత్యనా....

సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ ఖర్చుల కోసం ప్రతి పోలీసు స్టేషన్ నుంచి నెలకు రూ. 5 వేలు, పైఅధికారులు వచ్చినప్పుడు డీజిల్ ఖర్చులు ఇవ్వాలనే నిబంధనలు అమలవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని చిట్టిబాబు తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా పోలీసు బాస్‌తో జరిగిన ఓ సెట్ కాన్ఫరెన్స్‌లో వివాదం తలెత్తి ఆత్మహత్యకు దారి తీసినట్లు ఆరోపిస్తున్నారు. చిట్టిబాబు వ్యవహారాన్ని మనసులో పెట్టుకున్న జిల్లా అధికారి దుబ్బాకలో బెల్టు షాపులు నడుస్తున్నాయని, ఇసుక దందా నడుస్తోందని అంటూ వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిలదీసినట్లు చెబుతున్నారు. అయితే, తన పోలీసు స్టేషన్ పరిధిలో బెల్టు షాపులు లేవవని, దాదాపు 60 మంది కేసులు పెట్టామని, అనుమతి ఇస్తే పీడీ యాక్టు పెట్టడానికైనా సిద్ధమేనని చిట్టిబాబు చెప్పారని అంటున్నారు. అది జరిగిన తర్వాత గత నెల 3వ తేదీన శిక్షణ కోసం చిట్టిబాబు హైదరాబాదు వెళ్లారు.

 ప్రతీకారంగానే ఇలా చేశారా...

ప్రతీకారంగానే ఇలా చేశారా...

హైదరాబాదులో శిక్షణ పూర్తి చేసుకుని చిట్టిబాబు ఈ నెల 20వ తేదీిన విధుల్లో చేరడానికి చిట్టిబాబు వచ్చారని, అయితే విధుల్లో చేరకుండా అడ్డుకుని ఐడి పార్టీకి అటాచ్ చేశారని అంటున్నారు. అదే సమయంలో దుబ్బాక పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయించారని, చివరికి తిమ్మాపూర్ అనే గ్రామంలో ఓ బెల్టు షాపును పట్టుకుని కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఆ షాపును, ఇసుక రవాణాలను కారణంగా చూపిస్తూ చిట్టిబాబును సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయని, అయితే వాటిని తీసుకోవడానికి చిట్టిబాబు నిరాకరించారని చెబుతున్నారు.

మా నాన్నను వేధించారని కుమారుడు

మా నాన్నను వేధించారని కుమారుడు

తమ తండ్రి చాలా ధైర్వవంతుడని, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అని కాని ఆయనను ఉన్నతాధికారులు వేధించారని, ఆయనను దోషిగా చూపడానికి ప్రత్యేక పోలీసులతో గ్రామాల్లో సోదాలు చేయించాని చిట్టిబాబు కుమారుడు ప్రేమ్‌కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లు డిపార్టుమెంటుకు సేవ చేసిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం ఇచ్చాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని, ఉన్నతాధికారులు వేధిస్తున్నారని చెప్పారని ఆయన అన్నారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన ధర్నా చేశారు.

మంత్రి హరీష్ రావు మాట ఇదీ....

మంత్రి హరీష్ రావు మాట ఇదీ....

శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు మనోస్థయిర్యం కోల్పోవద్దని మంత్రి హరీష్ రావు అన్నారు .సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పాలని, వారి వద్ద కూడా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తెవాలని ఆయన అన్నారు. ప్రజల రక్షణ కోసం వాడే తుపాకులతోనే పోలీసులు తమ ప్రాణాలు తీసుకుంటే గుండె తరుక్కుపోతుందని హరీష్ రావు అన్నారు.

ఎమ్మెల్యే సోలిపేట మాట ఇదీ...

ఎమ్మెల్యే సోలిపేట మాట ఇదీ...

అవినీతి ఓ మంచి ఎస్సైని బలి తీసుకుందని స్థానిక శాసనసభ్యుడు సోలిపేట రామలింగా రెడ్డి అన్ారు. దళిత కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడం తీవ్రంగా కలచివేసినట్లు తెలిపారుర. తనకు తెలిసినంత వకు ఎస్సై చిట్టిబాబు మచ్చలేని పోలీసు అధికారి అని చెప్పారు.

పోలీసు ఆత్మహత్యలపై చాడ ఇలా...

పోలీసు ఆత్మహత్యలపై చాడ ఇలా...

గత రెండేళ్లుగా ఎస్సై స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అందుకు బాధ్యులు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖకు మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Chittibabu’s family alleged that he committed suicide as he was unable to bear the harassment of his superiors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X