Google Chrome: గూగుల్ క్రోమ్ అప్‍డేట్ చేసుకున్నారా..!
గూగుల్ (Google) తన క్రోమ్ (Chrome) వెబ్ బ్రౌజర్ కోసం ఒక భద్రతా ప్యాచ్‌ను విడుదల చేస్తోంది. ఇది హానికరమైన వైరస్ కంప్యూటర్‌లో చొరబడకుండా అండ్డుకుంటుంది. ఈ నవీకరణ Windows, macOS, Linux కంప్యూటర్‌లకు అందుబాటులో ఉంది. అప్ డేట్ కోసం తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం గూగుల్ నుంచి ఆరో అప్ డేట్ ఇంది.
ఇప్పటికే చాలా మంది వినియోగదారులు క్రోమ్ ను అప్‌డేట్ చేసుకున్నారు. తాజా గూగుల్ క్రోమ్ అప్‌డేట్‌తో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (NIST) ద్వారా ట్రాక్ చేయబడిన సెక్యూరిటీ బగ్‌ను కంపెనీ CVE-2023-6345గా ప్యాచ్ చేసింది. వినియోగదారులు Chrome కోసం ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ప్రారంభించాలి లేదా తాజా సంస్కరణలకు మాన్యువల్‌గా అప్‌డేట్ చేయాలని కంపెనీ కోరింది.

సెక్యూరిటీ లోపాలున్నాయ్! కస్టమ్ ట్యాబ్స్, వెబ్పీ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, ఇంటర్‌స్టీషియల్స్, పిక్చర్ ఇన్ పిక్చర్లో సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ క్రోమ్ లో అప్ డేట్ తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications