గుగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు వచ్చేశాయ్..

స్మార్ట్‌ఫోన్ వినియోదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో మోడల్స్ ఫోన్లను గూగుల్ సంస్థ అక్టోబర్ లో లాంచ్ చేయనుంది. అయితే అంతకంటే ముందే వాటి డిజైన్, స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు బయటకు వచ్చాయి. వీటిని వచ్చే నెల నాలుగో తేదీన భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో ఫీచర్స్ ఇవే..:పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్నాయి. పిక్సెల్ 8 మోడల్ 6.2 అంగుళాల FHD(ఫుల్ హెచ్డీ)+ OLED డిస్‌ప్లేతో ఉంటుంది. 60 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. బ్రైట్ నెస్ 2,000 నిట్స్ వరకు ఉంటుంది. పిక్సెల్ 8ప్రో విషయానికి వస్తే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. బ్రైట్ నెస్ 2,400 నిట్స్ వరకు ఉండనుంది.

Google Pixel 8 series specifications, price details are here..

స్టోరేజ్ కెపాసిటీ. :పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో మోడల్స్ లో టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ తో పాటు Google Tensor G3 చిప్‌ సెట్ ఉంటుంది. పిక్సెల్ 8 అయితే 8 GB LPDDR5X RAM, 128GB లేదా 256GB స్టోరేజ్‌ తో వస్తుంది. అయితే పిక్సెల్ 8ప్రో మాత్రం మరింత ఆకర్షణీయంగా 8GB LPDDR5X RAM తో పాటు 512GB నుంచి 1TB వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. UFS 3.1 టెక్నాలజీ కూడా అందించనున్నారు.

బ్యాటరీ సామర్థ్యం సూపర్..:బ్యాటరీ విషయానికి వస్తే పిక్సెల్ 8 మోడల్ కి 4,575mAh బ్యాటరీతో 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ అవకాశం ఉంది. ఇక పిక్సెల్ 8ప్రో అయితే 5,050mAh బ్యాటరీని కలిగి ఉండటంతో పాటు వైర్‌ లెస్ ఛార్జింగ్ 23W వరకు, 30W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ అవకాశం ఉంటుంది.

భద్రతకు ప్రాధాన్యం..:ఈ రెండు మోడల్స్ విషయంలో భద్రత, సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ లకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 7 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉన్నాయి.

Google Pixel 8 series specifications, price details are here..

కెమెరా పనితీరు భేష్..:గూగుల్ పిక్సెల్ 8 సిరీస్లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ సెన్సార్ తో 30 ఎఫ్పీఎస్ వద్ద 8కే వీడియో తీసేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 11 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. పిక్సెల్ 8ప్రోకు 11 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 64 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 49 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుందని తెలుస్తోంది. 10.5MP డ్యూయల్ PD ఫ్రంట్ కెమెరా, వైడ్ కెమెరాలో OIS, EIS వంటి అదనపు ఫీచర్లను పొందుపరుస్తారు. అయితే, Pixel 8 Pro 48MP క్వాడ్ PD అల్ట్రావైడ్ కెమెరాతో 30x వరకు సూపర్ రెజ్ జూమ్ చేయగల 48MP క్వాడ్ PD టెలిఫోటో కెమెరా ఉంటుంది.

ధరెంతో తెలుసుకోండి .:అత్యంత ఆకర్షణీయమైన ఈ మొబైల్స్ ధర విషయానికి వస్తే పిక్సెల్ 8 ధర సుమారు రూ.52,000 వరకు ఉండనుంది. ఇక పిక్సెల్ 8ప్రో ధర సుమారు రూ.75,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ Wi-Fi 7, బ్లూటూత్ v5.3, NFC సామర్థ్యాలను కలిగి ఉంటాయి. నీరు, ధూళి కట్టడి కోసం IP68 రేటింగ్‌ కలిగి ఉంటాయి. అండర్ డిస్‌ ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, ఫేస్ ఐడెంటిటీ వంటి భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+