మార్కెట్ లోకి హోండా కొత్త బైక్

హోండా మోటార్‌ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మన దేశంలో సరికొత్త బైక్స్ విడుదల చేస్తూ వస్తోంది. గతంలో విడుదల చేసిన హోండా SP125 టూవీలర్‌ను ఈ సంవత్సరం బీఎస్-6 స్టాండర్ట్స్-2 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి '2023 హోండా SP125' (2023 Honda SP125) పేరుతో విడుదల చేశారు. ఇది ఇది సూపర్ సక్సెస్ అయింది.

దీనికి సక్సెసర్ గా హోండా SP125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను (Honda SP125 Sport) ఆవిష్కరించింది. దసరా, దీపావళి పండుగల సీజన్‌కు ముందు ఈ కొత్త మోడల్‌తో అమ్మకాలు పెంచుకువడానికి హోండా ప్రయత్నిస్తోంది.

Honda SP125 Sport details

రెండు కొత్త రంగుల్లో..
హోండా SPR125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాత తరం మోడళ్లలో వినియోగించిన అదే 123.94cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10.72bhp పవర్‌ను, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు ఇంజిన్‌ను BS-VI OBD-2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ అనే రెండు కొత్త రంగుల్లో వచ్చింది.

బెస్ట్ ఫీచర్స్ ..
దీంట్లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తోపాటు గేర్ పొజిషన్ ఇండికేటర్, మైలేజ్ ఇన్ఫర్మేషన్‌ను ఇది డిస్‌ప్లే చేస్తుంది. కొత్త SP125 స్పెషల్ ఎడిషన్ 10 సంవత్సరాల వారంటీ తో అందుబాటులో ఉంటుంది. ధరను రూ. 90,567గా హోండా నిర్దేశించింది. ఈ కొత్త మోటార్‌ సైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత కాలానికి మాత్రమే దొరుకుతాయి. పండగ సీజన్ వరకే అందుబాటులో ఉంటాయి. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. యూత్‌కి నచ్చేలా డిజైన్ చేసినట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+