రిలయన్స్ జియో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో టెలికం రంగంలో కూడా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ తీసుకొచ్చింది. తాజాగా ఎయిర్ ఫైబర్ ప్రవేశపెట్టింది. దేశంలోని అనేక ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలందించడమే ధ్యేయంగా జియో ఫైబర్ ను తీర్చిదిద్దింది. ఎన్నో ప్లాన్లు ప్రవేశపెట్టింది. తాజాగా ఎలాంటి రుసుము లేకుండా 30 రోజులపాటు జియో ఫైబర్ సర్వీసులను పొడిగిస్తోంది.
లాంగ్ టర్మ్ ప్లాన్లు ఎంచుకోవాలి : జియో ఫైబర్ ఉచిత సర్వీస్ పొందాలనుకునేవారు లాంగ్ టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. సంవత్సర ప్లాన్ రీఛార్జితోపాటు అదనంగా 30 రోజుల ఉచిత సర్వీస్ పొందుతారు. 12 నెలల రీఛార్జితో 13 నెలల వరకు సర్వీస్ సేవలందుతాయి. ఆరునెలల రీఛార్జితో అయితే 15 రోజులు ఉచిత సర్వీసు లభిస్తుంది. నెలవారీ ప్లాన్లు, త్రైమాసిక ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తించదని కంపెనీ ప్రకటించింది. నెలకు రూ.999 రీఛార్జితో ఓటీటీ ప్లాన్లను జియో ఫైబర్ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్లాన్ తో యూజర్లు వివిధ రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తోపాటు ఉచితంగా సెటప్ బాక్స్ పొందొచ్చు.

ప్లగ్ అండ్ ప్లే సిస్టం : ఎయిర్ ఫైబర్ పేరుతో కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ను జియో అందిస్తోంది. హైస్పీడ్(1GBPS)సేవలను అందించేందుకు 5G టెక్నాలతో పని చేస్తుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో ఎయిర్ ఫైబర్ సర్వీసులుంటాయి. జియో ఫైబర్ పూర్తిగా వైరింగుతో ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ అయితే కేవలం ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్‌తో పని చేస్తుంది. దీన్ని స్విచ్ బోర్డుకు కనెక్ట్ చేస్తే ఇల్లంతా వైఫై జోన్ గా మారిపోతుంది. ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లోను దీన్ని వాడుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లొచ్చు.












Click it and Unblock the Notifications