WhatsApp: 69 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్..
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. భారత్ లో భారీ స్థాయిలో ఖాతాలను నిషేధించింది. ఐటి రూల్స్ 2021కి విరుద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంది. 2023 డిసెంబర్ లో భారతదేశంలో రికార్డు స్థాయిలో 69 లక్షల ఖాతాలను నిషేధించిందినట్లు తాజాగా ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 31 మధ్య వాట్సాప్ 6,934,000 ఖాతాలపై నిషేధం విధించింది.
వీటిలో 1,658,000 ఖాతాలు ఎటువంటి వినియోగదారు నివేదికలు లేకుండా ముందస్తుగా నిషేధించింది. డిసెంబర్‌లో భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఈమ మెసేజింగ్ దిగ్గజంకు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదుల వచ్చినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో 13 నివేదికలపై వాట్సాప్ చర్యలు తీసుకుంది. "అకౌంట్స్ యాక్షన్డ్" అనేది వినియోగదారు నివేదికల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటారు.

ఇందులో ఖాతాని నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటివి ఉంటాయి. డిసెంబర్ లో 16వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చాయని పేర్కొంది. వాటిలో 13 రిపోర్ట్స్ ఆధారంగా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సప్ వివరించింది. వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా పలు అకౌంట్లను బ్యాన్ చేయగా, కొన్నిటిని రిస్టోర్ చేసినట్లు పేర్కొంది. .
కంటెంట్-సంబంధిత సమస్యలపై దృష్టి సారించి సోషల్ మీడియా వినియోగదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఇటీవల గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తీసుకునే నిర్ణయాలను సవాలు చేసే వినియోగదారుల నుండి వచ్చిన అప్పీళ్లను GAC నిర్వహిస్తోంది.నవంబర్‌లో వాట్సాప్ భారతదేశంలో 71 లక్షలకు పైగా సమస్యాత్మక ఖాతాలపై చర్య తీసుకుంది.
యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అకౌంట్లను బ్యాన్ చేశామని వాట్సాప్ పేర్కొంది. వాటిలో కొన్ని వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేయగా , కొన్నిటిని సంస్థ నిబంధనల ప్రకారం బ్యాన్ చేసినట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications