ఆంజనేయుడి జన్మస్థలంలో జైహనుమాన్ షూటింగ్ ఆరంభం: కాంతారా రిషభ్ షెట్టి కీ రోల్
మచ్ అవైటెడ్ మూవీ.. జై హనుమాన్. 2024 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ కు స్వీక్వెల్ ఇది. 2025 సంక్రాంతికి విడుదల అవుతుందని అప్పట్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రామిస్ చేశాడు గానీ అది సాధ్యపడలేదు. ఇప్పటివరకు కూడా సినిమా చిత్రీకరణే ప్రారంభం కాలేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత కీలకమైన హనుమాన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలనే విషయం మీదే కొంత జాప్యం జరిగిందనేది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు తాజాగా సినిమా పట్టాలెక్కింది. సెట్స్ పైకి వచ్చింది. కొద్దిసేపటి కిందటే కర్ణాటకలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం హంపి సమీపంలోని అంజనాద్రి బెట్టపై షూటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో క్లాప్ కొట్టారు. కాంతారా, కాంతారా ఛాప్టర్ 1తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన నట- దర్శకుడు రిషభ్ షెట్టి.. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను పోషిస్తోన్నారు. రిషభ్ షెట్టి, ఆయన భార్య ప్రగతి షెట్టి, తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా ముహూర్తం షూటింగ్ లో పాల్గొన్నారు.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం జైహనుమాన్ కు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనాద్రిలోనే ఈ సినిమా ప్రారంభించాలని నిర్ణయించారు. నేడు ముహూర్తంలో కీలక సన్నివేశాలకు క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. రిషభ్ షెట్టి ఈ సినిమా ముహూర్తానికి అంజనాద్రికి చేరుకోగానే అభిమానుల సంద్రం పోటెత్తింది. రిషబ్ దైవిక వ్యక్తిత్వం హనుమంతుడి పాత్రకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నారు.
ఈ ప్రారంభోత్సవానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖులు హాజరై ఆంజనేయుడి ఆశీస్సులు అందుకున్నారు. ముహూర్త సమయంలో రిషబ్ శెట్టి చూపిన ప్రశాంతత, భక్తిభావం అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని యోచిస్తున్నారు. పౌరాణిక కథాంశాన్ని గ్రాఫిక్స్, సాంకేతికతతో రూపొందించనున్నారు. హనుమంతుని శక్తిని, భక్తిని తెరపై అద్భుతంగా చూపడమే లక్ష్యం. ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తారనే వార్తలున్నప్పటికీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. షూటింగ్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications