AP Intermediate Exams 2027: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్- తేదీలివే..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ (AP Intermediate Exams 2027 Schedule) ఇవాళ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇంటర్ తొలి, ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్దులు వచ్చే ఏడాదిలో ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరి కోసం పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు ఇవాళ ఓ ప్రకటన చేసింది. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల తేదీలతో పాటు ఇతర వివరాలు కూడా ఉన్నాయి.
ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 25 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్ తో పాటు బ్యాక్ లాగ్ విద్యార్దులకు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ, ఒకేషనల్ కు ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తొలి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి.

మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 24, బుధవారం భాషలు పేపర్-1, సంబంధిత సబ్జెక్టుల పేపర్-1
ఫిబ్రవరి 26, శుక్రవారం ఇంగ్లిష్ పేపర్-1
మార్చి 1, సోమవారం గణితం/సివిక్స్ పేపర్-1
మార్చి 3, బుధవారం బయాలజీ/హిస్టరీ పేపర్-1
మార్చి 5, శుక్రవారం ఫిజిక్స్/ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 9, మంగళవారం కెమిస్ట్రీ/కామర్స్ పేపర్-1
మార్చి 12, శుక్రవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్-1
మార్చి 15, సోమవారం మోడ్రన్ లాంగ్వేజ్/జాగ్రఫీ పేపర్-1
ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 25, గురువారం భాషలు పేపర్-2, సంబంధిత సబ్జెక్టుల పేపర్-2
ఫిబ్రవరి 27, శనివారం ఇంగ్లిష్ పేపర్-2
మార్చి 2, మంగళవారం గణితం/సివిక్స్ పేపర్-2
మార్చి 4, గురువారం బయాలజీ/హిస్టరీ పేపర్-2
మార్చి 8, సోమవారం ఫిజిక్స్/ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 11, గురువారం కెమిస్ట్రీ/కామర్స్ పేపర్-2
మార్చి 13, శనివారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్-2
మార్చి 16, మంగళవారం మోడ్రన్ లాంగ్వేజ్/జాగ్రఫీ పేపర్-2












Click it and Unblock the Notifications
