ఈ ఏడాది తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన బ్యూటీ ఎవరో తెలుసా..? అన్నీ ప్లాఫులే..
మరో వారం రోజుల్లో 2025 ముగుస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం పెద్ద హీరోలు, హీరోయిన్లు అయితే భారీ బడ్జెట్ చిత్రాలు.. ఏళ్లకేళ్లు షూటింగ్ ల కారణంగా సంవత్సరానికి ఒక సినిమా రావడమే కష్టం అయిపోయింది. ఇక ఈ ఏడాదిలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కీలకమైన విశేషాలు జరిగాయి. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా.. మరికొంత మంది విడిపోయారు. అలాగే మరికొంతమంది దిగ్గజ నటులు కన్నుమూశారు.
అయితే 2025 లో టాలీవుడ్ కు చెందిన సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల. ఏకంగా మూడు చిత్రాల్లో కనిపించింది. యూత్ హీరోలు.. అగ్రహీరోలు అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత ధమాకా చిత్రంతో హిట్ అందుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గుంటూరు కారం చిత్రంలో నటించింది. పుష్ప-2 లో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.

2025 లో శ్రీలీల ఏకంగా మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది మొదట్లో నితిన్ తో రాబిన్ హుడ్ చిత్రం చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత యంగ్ హీరో కిరీటి తో జూనియర్ సినిమా చేసింది. ఆ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక చివరగా మాస్ మహారాజ రవితేజతో మాస్ జాతర సినిమాలో నటించింది శ్రీలీల. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ ఏడాదిలో శ్రీలీల చేసిన సినిమాలు అన్నీ ప్లాఫ్ లుగా మిగిలిపోయాయి.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!











Click it and Unblock the Notifications