ఇంత బోల్డ్‌గా ఉందేంటి.. ఈ సినిమా!
బోల్డ్ కంటెంట్, సామాజిక అంశాల కలబోతగా 2024లో సంచలనం సృష్టించిన చిత్రం 'హాట్ స్పాట్'. ఆంథాలజీ ఫార్మాట్లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much) సిద్ధమైంది. మొదటి భాగం 'ఆహా' ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ సీక్వెల్‌ను కూడా సామాజిక ముసుగులను తొలగించే మూడు ప్రధాన కథలతో ఆసక్తికరంగా మలిచారు.స్టార్ హీరోల అభిమానుల మధ్య జరిగే గొడవలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. తన కొడుకును ఫ్యాన్ వార్స్‌లో కోల్పోయిన తండ్రిగా ఎం.ఎస్. భాస్కర్ పండించిన నటన, ఆయన ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

అమ్మాయిల దుస్తుల విషయంలో సమాజం చూసే కోణంపై దర్శకుడు గట్టి సెటైర్ వేశారు. తండ్రిగా తంబి రామయ్య, కూతురిగా నటించిన నటి మధ్య సాగే ఈ కథలో వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది.2050 నుంచి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన ఒక అమ్మాయితో సాగే ప్రేమకథ ఇది. భవిష్యత్తు గురించి ఇందులో వేసిన జోకులు నవ్వులు పూయిస్తాయి, అయితే దీని క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా చాలా బోల్డ్‌గా ఉంటుంది.
యూత్ లో Hot Spot 2
ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, అశ్విన్ కుమార్, భవాని శ్రీ, ఆదిత్య భాస్కర్ వంటి యువ నటులతో పాటు తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రలు పోషించారు. అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం నిర్మించిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పించింది.
జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 3.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మొదటి భాగం కంటే మెరుగైన ఫలితాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, దర్శకుడు ఎంచుకున్న పాయింట్స్ బాగున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Hot Spot 2 సరికొత్త రికార్డు
ప్రస్తుతం ఈ చిత్రం ఒకేసారి ఆరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 20 నుండి తమిళం (సబ్-టైటిల్స్‌తో), హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక శుభవార్త.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న 'ఆహా' వేదికగా తెలుగులో కూడా విడుదల అయింది.
బోల్డ్ అండ్ సోషల్ సెటైర్ చిత్రాలను ఇష్టపడే వారు, సమాజంలోని సున్నితమైన అంశాలను విభిన్న కోణంలో చూడాలనుకునే వారు 'హాట్ స్పాట్ 2 మచ్'ను తప్పక వీక్షించవచ్చు
-
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications