ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న మూవీ 'ధురంధర్-2' గతేడాది రిలీజైన ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ధురంధర్ మూవీ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దాంతో ధురంధర్-2 రెండో భాగంపై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే 'ధురంధర్-2' ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ఎక్స్ లో పలు రకాలుగా రివ్యూలు ఇస్తున్నారు.
ఫిల్మ్ మేకింగ్ అద్దిరిపోయిందని, రణ్ వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ చాలా అద్భుతంగా వచ్చినట్లు ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ దాదాపు 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించినట్లు సమాచారం. వాయిలెన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ దేశభక్తి సినిమా కాబట్టి ఆ సీన్స్ అన్నీ జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి బొమ్మ భారీ బ్లాక్ బస్టర్ అనేలా ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
#OneWordReview...#DhurandharTheRevenge: MASTERPIECE.
— taran adarsh (@taran_adarsh) March 18, 2026
Rating: ⭐️⭐️⭐⭐️½#Dhurandhar2 is CINEMA AT ITS BEST... Delivers on every front – scale, drama, emotions, action, performances and impact... Take a bow, #AdityaDhar – sure-shot EPIC BLOCKBUSTER. #Dhurandhar2Review
The… pic.twitter.com/IXP9Z36RTI
ధురంధర్ 2 మూవీపై ఇప్పటికే ప్రముఖ క్రిటిక్స్ ఉమెర్ సంధు, తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు రివ్యూ ఇచ్చారు. సినిమా పైసా వసూల్ అంటూ తెలిపారు. సినిమా స్కేల్, డ్రామా, యాక్షన్, నటన, ఇంపాక్ట్ ప్రతీదానికి ఓ సెల్యూట్ చేయొచ్చని రివ్యూలో అన్నారు. ఈ మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సినిమా ముందు బాహుబలి, పుష్ప 2 లు ఏమాత్రం సాటి రావని పేర్కొన్నారు. రణ్ వీర్ సింగ్ స్కీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఫైర్ క్రియేట్ చేశారు. ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 3000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఉమెర్ సంధూ జోస్యం చెప్పారు.

రణ్ వీర్ సింగ్ ఈ మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. తన కెరీర్ లోనే బెస్ట్ ఫెర్మామెన్స్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ తో పాటుగా సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేశ్ బేడీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ధురంధర్ మూవీ తొలిభాగం గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications