K‑Pop Demon Hunters:ఆస్కార్ వేదికపై సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్..!!

నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యానిమేషన్ చిత్రం 'కె-పాప్ డెమొన్ హంటర్స్‌' (K-Pop Demon Hunters) సరికొత్త చరిత్ర సృష్టించింది. 98వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ 2026) ఈ చిత్రం 'ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్' కేటగిరీలో గోల్డెన్ స్టాచ్యూని దక్కించుకుని అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడమే కాకుండా, అవార్డుల సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం.

యానిమేషన్ ప్రపంచంలో డిస్నీ, పిక్సర్ వంటి దిగ్గజాల మధ్య ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ న సత్తా చాటింది. 'ఆర్కో', 'ఎలియో', 'ది క్యారెక్టర్ ఆఫ్ రెయిన్, భారీ అంచనాలు ఉన్న 'జూటోపియా 2' వంటి చిత్రాలను వెనక్కి నెట్టి 'కె-పాప్ డెమొన్ హంటర్స్‌' ఆస్కార్ విజేతగా నిలిచింది.

k-pop-demon-hunters-wins-best-animated-feature-at-98th-academy-awards-beats-disney-pixar-rivals

కథా నేపథ్యం: పాటలు పాడుతూ.. దయ్యాలను వేటాడుతూ..

కొరియన్-కెనడియన్ ఫిల్మ్ మేకర్ మాగీ కాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒక వినూత్నమైన కథాంశంతో రూపొందింది. ఒక కె-పాప్ (K-Pop) అమ్మాయిల బృందం, ప్రపంచానికి పాప్ స్టార్‌లుగా కనిపిస్తూనే.. రహస్యంగా రాక్షసులను వేటాడే 'డెమొన్ హంటర్స్‌'గా ఎలా పోరాడారనేదే ఈ సినిమా కథ.సంగీతం,యాక్షన్,ఫాంటసీ అంశాలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం,ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ ఇంకా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా కైవసం చేసుకుంది.

దర్శకురాలి భావోద్వేగ ప్రసంగం

ఆస్కార్ అవార్డు అందుకున్న వేదికపై దర్శకురాలు మాగీ కాంగ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు."నాలా కనిపించే మీ అందరికీ (కొరియన్లు/ఆసియన్లు) వెండితెరపై ఇలాంటి గుర్తింపు దక్కడానికి ఇంత సమయం పట్టినందుకు క్షమించండి.ఇది కొరియాకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొరియన్లందరికీ అంకితం" అంటూ ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

ఒరిజినల్ కథలకే ఓటు
ఇటీవలి కాలంలో ఆస్కార్ ఓటర్లు ఇప్పటికే ఉన్న కథలను కాకుండా,సరికొత్త ఒరిజినల్ కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.గతంలో హయావో మియాజాకీ తీసిన 'ది బాయ్ అండ్ ది హెరాన్',లాట్వియన్ చిత్రం 'ఫ్లో'మాదిరిగానే,ఇప్పుడు 'కె-పాప్ డెమొన్ హంటర్స్‌'కూడా ఆ ఒరవడిని కొనసాగించింది.

సంగీత ప్రపంచంలోనూ సంచలనం

ఈ చిత్రంలోని 'గోల్డెన్' (Golden) సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇప్పటికే గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈ పాట, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.. దీంతో మొత్తంగా ఈ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి.

ఒకప్పుడు కేవలం కొరియాకు మాత్రమే పరిమితమైన కె-పాప్ సంస్కృతి, నేడు ఆస్కార్ వంటి అత్యున్నత వేదికలపై గర్వంగా నిలబడటం విశేషం. 'కె-పాప్ డెమొన్ హంటర్స్‌' విజయం యానిమేషన్ రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+