సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫేమ్, టాలీవుడ్ యువ నటి పునర్నవి భూపాలం తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. శుక్రవారం(మార్చి 20) రోజున తన చిరకాల మిత్రుడు హేమంత్ వర్మను ఆమె పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న పునర్నవి.. శుక్రవారం నాడు అత్యంత సన్నిహితుల మధ్య ఓ ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.
'ఉయ్యాల జంపాల' నుంచి 'బిగ్ బాస్' వరకు..
రాజ్ తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉయ్యాల జంపాల' సినిమాతో పునర్నవి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో తన సహజసిద్ధమైన నటనతో మెప్పించిన పునర్నవి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న అనంతరం పునర్నవి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తనదైన వ్యక్తిత్వంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సినీ కెరీర్ కంటే బిగ్ బాస్ షో ద్వారానే ఆమెకు విపరీతమైన గుర్తింపు లభించింది.

లండన్‌లో విద్య.. ఫోటోగ్రాఫర్‌తో ప్రేమ
బిగ్ బాస్ తర్వాత పునర్నవి సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. అక్కడ చదువుకుంటూనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో తన ఎంగేజ్మెట్ వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచిన పునర్నవి.. ఇప్పుడు వివాహం చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్న హేమంత్ వర్మ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
సింపుల్‌గా ప్రైవేట్ వెడ్డింగ్
అట్టహాసంగా కాకుండా.. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. పునర్నవి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తర్వాత పునర్నవి మళ్లీ సినిమాల్లోకి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications