దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్
యాంగ్రీ హీరో రాజశేఖర్ గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోగా నటించారు. సినిమాలు చేయకపోయినా ఎప్పటికీ క్రేజ్ ఉండే హీరోల్లో రాజశేఖర్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీలో రాజశేఖర్ కనిపించారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆయన సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది. ఇక ఇటీవల రాజశేఖర్.. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని సినిమాల్లో జోష్ పెంచినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సీనియర్ హీరో మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన బైకర్ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీలో శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్ నటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను అడ్జస్ట్ అయ్యా...ఎక్కువ సినిమాలో నన్ను పెట్టుకోండి
— Telugu360 (@Telugu360) March 22, 2026
- రాజశేఖర్ రిక్వెస్ట్#Rajasekhar #Biker pic.twitter.com/Rt3QNl2umN
ఈ మూవీలో శర్వానంద్ హీరోగా చేస్తున్నారని.. తాను సెకండ్ హీరోగా చేస్తున్నానని అన్నారు. "అయ్యో సెకండ్ లెవెల్ లోకి వెళ్లిపోయామనే బాధ నాలో ఉంది. అయితే మా పిల్లలు అన్నారు. అప్పట్లోలా లేదు ఇప్పుడు అంతా ఒకటే.. సో.. సెకండ్ లెవెల్ అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఏంటంటే..? నన్ను ఎక్కువ సినిమాల్లో పెట్టుకోండి.." అని రాజశేఖర్ తెలిపారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక 'బైకర్' మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..!












Click it and Unblock the Notifications