పాకిస్థాన్ ను షేక్ చేస్తున్న 'ధురంధర్'.. రికార్డు వ్యూస్ తో..
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రూ. 280 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా గతేడాది డిసెంబర్ 5 న విడుదల అయింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా 2026 జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ధురంధర్.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక భారత్ లో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా 'ధురంధర్' రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ లిస్టులో పుష్ప 2 టాప్ లో దూసుకెళ్తోంది. 2024లో రిలీజైన పుష్ప 2 భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఒక్క భారత్ లోనే రూ. 730 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఇక ధురంధర్ మూవీపై విడుదల సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంగా పాక్ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసే ధురంధర్ లాంటి చిత్రాలకు థియేటర్లలో అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ సమయంలో చాలామంది ఈ మూవీని వీక్షించలేకపోయారు. అయితే ఇటీవల ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి పాకిస్థాన్ లో ఈ మూవీ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్ లో టాప్ వ్యూస్, వాచ్ అవర్స్ సాధించడం విశేషం.

ఇక ఈ మూవీకి పాకిస్థాన్ నుంచి విశేష ఆదరణ వస్తోంది. పాకిస్థాన్ ప్రజలు ఈ మూవీ చూసి సినిమా చాలా రియలిస్టిక్ గా, ఆకర్షణీయంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. సాధారణ చిత్రాల కంటే ఈ మూవీ భిన్నంగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటుగా బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ, మానవ్ గోహిల్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. శాశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 2 ఈ ఏడాది మార్చి 19 న రిలీజ్ కానుంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత











Click it and Unblock the Notifications