నా పెళ్లి కంటే ముందు మా అమ్మ పెళ్లి చేయాలి - సుప్రీత
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి. బొమ్మరిల్లు, రెడీ, నాయక్, దుబాయ్ శీను, బాద్ షా లాంటి సినిమాల్లో సురేఖా వాణి కామెడీ కూడా బాగా పండించింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించింది. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటోంది. తన కూతురు సుప్రీతాతో కలిసి ఆమె చేసే రచ్చ అందరికి తెలిసిందే.
మోడ్రన్ డ్రస్సుల్లో సురేఖవాణి, తన కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. అందంలో మాత్రం కూతురుకే గట్టి పోటీ ఇస్తుంది సురేఖా వాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ సురేఖా వాణి షేర్ చేస్తున్న ఫొటోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. కాగా సురేఖ వాణి - సుప్రీత తల్లీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. భర్త మరణం తర్వాత తన కూతురే ప్రపంచంగా బతుకుతున్న సురేఖ కోసం, సుప్రీత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.
సుప్రీత మనసులోని మాట వింటే ఆమెకు తన తల్లిపై ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది. అయితే తాజాగా తన తల్లి పెళ్లి విషయంలో సుప్రీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లేముందే, నా తల్లి జీవితంలో ఒక తోడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆమెను అమితంగా ప్రేమించే, గౌరవించే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. ఈ విషయంపై ఇప్పటికే నేను మా బంధువులతో కూడా చర్చించాను, వారందరూ కూడా నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు" అని సుప్రీత తెలిపింది. సురేఖా వాణి రెండో పెళ్లి గురించి సుప్రీత ఆలోచిస్తున్నప్పటికీ.. అది కేవలం తన ఇష్టం మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది.

ఫైనల్ గా అమ్మ సంతోషమే తనకు ముఖ్యమని.. తన నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. నాన్న ఉన్న స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి అమ్మ ఇష్టపడటం లేదని.. ఆమె భావాలను నేను గౌరవిస్తాను. తనకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను. కానీ జీవితాంతం అమ్మ ఒంటరిగా ఉండకూడదనేదే నా తపన" అని ఓపెన్ అయ్యింది.
-
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications