దుమ్ములేపుతున్న మూవీ.. భారీగా పెరిగిన కలెక్షన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుస హిట్స్ కొట్టేవారిలో శ్రీవిష్ణు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఒకదాన్ని మించి మరోకటి ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఇప్పటికే యువతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన కామెడీ టైమింగ్, స్టోరీ సెలక్షన్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పిస్తున్నాడు. ఇక తాజాగా శ్రీవిష్ణు నుంచి వచ్చిన మరో మూవీ 'విష్ణు విన్యాసం'.. ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.
'విష్ణు విన్యాసం' మూవీకి మొదటి రోజు గంటకు 2 వేల టికెట్స్ బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతే రెండో రోజు గంటకు 4 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనిని బట్టే ఈ చిత్రానికి పబ్లిక్ లో ఎలాంటి మౌత్ టాక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోరోజు ఈ మూవీకి రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో రూ. 6 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రానున్నట్లు సినీ విశ్లేషకుల ద్వారా స్పష్టం అవుతోంది.

ఇక రిలీజ్ కు ముందు 'విష్ణు విన్యాసం' మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 12 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అంటే ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రం 50 శాతం రీకవరీని సొంతం చేసుకోబోతోంది అని సమాచారం. రానున్న రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత మార్చి 6న ఆయన హీరో గా నటించిన 'మృత్యుంజయ్' అనే సినిమా కూడా విడుదల కానుంది.
-
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !!












Click it and Unblock the Notifications