కాలమ్: నాకు తెలిసిన కిరణన్న

కిరణ్ కుమార్ రెడ్డి పాలిచెర్ల నెల్లూరు జిల్లా దామరమడుగులోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. కిరణ్ కుమార్ రెడ్డి బలపనూరుకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వైయస్ రాజశేఖర రెడ్డితో కిరణ్ సాహచర్యం అప్పుడు ప్రారంభమై చివరి దాకా సాగింది. అమెరికాలోని హౌస్టన్‌లో ఎండి ఆండర్సన్ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డితో చాలా సమయం గడిపాను. తాను పేదలకు సేవ చేయగలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేవుడు ప్రసాదించిన మేరకు తాను పేదలకు సేవ చేయగలిగానని అనేవారు.
వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు. మరో ప్రపంచానికి వెళ్లడానికి 25 ఏళ్ల వైయస్ రాజశేఖర రెడ్డి సాహచర్యం చాలునని అన్నారు. హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు కేంద్ర కార్యాలయంలో మొదటిసారి ఆయనను కలిశాను. అప్పటి నుంచి ఆయన పట్ల తన గౌరవభావం కొనసాగుతూనే ఉన్నది. హైదరాబాదులోనూ హౌస్టన్‌లోనూ అతనితో గడిపిన క్షణాలు మరుపునకు రానివి.
వ్యాధి నుంచి ఆయన బయటపడతారని, ఫీనిక్స్ పక్షిలా లేస్తారనే ఆశాభావం నాకు ఉండేది. అయితే, తన మిత్రులను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. వైయస్ జగన్‌తో పాటు వేలాది మంది మిత్రులకు ఆయన లేని లోటు పూరించలేనిదే. కిరణన్న జ్ఞాపకాలు నా వెంట నిరంతరం ఉంటాయి. పేదల పట్ల దయగుణాన్ని, పాషన్‌ను, సౌహార్ద్రతను, వైయస్ పట్ల, జగన్ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరిచిపోలేం. కిరణన్నను నేను మిస్సవుతున్నాను.
గురువారెడ్డి, అట్లాంటా












Click it and Unblock the Notifications