వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 ఎన్నికలు: దేశ రాజకీయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

2014 ఎన్నికల్లో ఏ పార్టీలు గెలుస్తున్నాయి, కేంద్రంలో పవరి ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు, ఊహాగానాలు సర్వత్రా మొదలయ్యాయి. ఎన్నికల జోస్యగాళ్లు, పత్రికలు, టెలివిజన్‌ ఛానెళ్లూ సర్వేలతో, సామాజిక మీడియాల్లో, స్వంత పత్రికలు ఛానల్స్‌తో ప్రచారాలు మొదలుపెట్టాయి. ఎప్పటిమాదిరిగానే జ్యోతిష్యులు రంగంలోకి దిగారు.

లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు రైటిస్టులు, లెప్టిస్టులు, సెంట్రిస్టులు మెనార్టీలు ఇలా రకరకాల పార్టీలకు, సిద్ధాంతాలకు చెందిన ఎంపిలుంటారు. ప్రస్తుతం ఏ ఒక్క పార్టీ మెజారిటీ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ప్రధానపక్షం ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్నా మిత్రపక్షాల్ని కలుపుకొని వెళ్లాల్సిందే. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆవిష్కరించాల్సిందే. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కూడా అలాంటి కసరత్తు తరవాత ఏర్పాటైందే. గతంలో ఎన్‌డీఏ వాజ్‌పాయ్‌ ప్రభుత్వం కూడా అలా ఏర్పడినదే. కాంగ్రెస్‌ సారథ్యంలోని సంకీర్ణ సర్కారుకు దాదాపు పాతిక పార్టీలు మద్దతు ఇచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 206 సీట్లు వచ్చాయి. 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన పక్షానికి అత్యధిక పార్టీల మద్దతు అత్యవసరమవుతుంది. పెద్ద సంఖ్యలో స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా కూడగట్టాల్సి రావచ్చు.

India

2014 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మరిన్ని చీలికలు ఏర్పడి, చిన్న పార్టీలు కూడా ఎక్కువ స్థానాలు గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రాంతీయ అభిమానం ప్రాతిపదికగా పుట్టుకొచ్చిన పార్టీలు అనేకం ఉన్నాయి. మతం, కులం ఆధారంగా నడస్తున్న పార్టీలూ ఇదివరకే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం దాదాపు అయిదు దశాబ్ధాలపాటు కాంగ్రెస్‌ అధికారాన్ని అనుభవించింది. నేటికీ అదే అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన కొందరు చిన్నచిన్న పార్టీలు ఏర్పడ్డారు. అలాగే కాంగ్రెస్‌ అనేక చిన్న పార్టీలను తనలో కలుపుకున్నది. అదంతా ప్రజాస్వామిక ప్రక్రియలో భాగమే. అని ఆ పార్టీలవారు, రాజకీయ పండితులు చెప్తుంటారు.

కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఏర్పడిన రాజకీయ పక్షం భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు అది జనసంఫ్‌ుగా ఉండేది. మధ్యలో కొందర్ని కలుపుకుని జనతా పార్టీగా అవతరించింది. చివరికి అదే భారతీయ జనతా పార్టీగా నిలబడిరది. ఈ పార్టీకి ‘బ్రాహ్మణ బనియాల' పార్టీ అని పేరుంది. కాంగ్రెస్‌ పార్టీలో మితవాద బ్రాహ్మణులు, ఎస్సిలు, మైనార్టీలు ఎక్కువగా ఉంటాయి. ఎస్సిలు, మైనార్టీలకు కొద్దిగా అధికారాన్ని తెడ్డుతో రుచిచూపిస్తూ అసలు అధికారాన్ని కాంగ్రెస్‌లో ఉత్తరాది బ్రాహ్మణులే అనుభవిస్తూ వస్తున్నారు. అయితే వీరు మరీ చాందసులు ఏమీ కాదు. వీరు అనుభవించిన రాజ్యాధికారం అంతా బీసీలకు పంచాల్సిందే.

కొన్ని రాష్ట్రాల్లో క్షత్రియ, కమ్మ, రెడ్డి, యాదవ తదితరులు కాంగ్రెస్‌ పార్టీలోని బ్రాహ్మణ అధినాయకులకు ఎదురుతిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నెమ్మది నెమ్మదిగా అధికార పగ్గాలను జారవిడుచుకున్న కాంగ్రెస్‌ కేంద్రంలో మాత్రం తన పట్టును ఇంకా కోల్పోలేదు.

తమిళనాడులో పెరియార్‌ అందించిన బ్రాహ్మణేతర సిద్ధాంత బలంతో ద్రవిడులు కాంగ్రెస్‌ పార్టీని ఆ రాష్ట్రంలో కుకటివ్రేళ్ళతో పెకిలించి పారేశారు. కేరళలో కమ్యూనిస్టు అధికారంలోకి వచ్చినా వారంతా బ్రాహ్మణులే. నిజానికి సిపిఐ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉండే పార్టీ. ‘కాంగ్రెస్‌ వారి అధికార బండి సాగుతున్నప్పుడు సీపీఐ తిడుతుంది, ఆగినప్పుడు నెడుతుంది' అని సిపిఐపై ఒక నానుడి ప్రచారంలో ఉండనే ఉన్నది. మొత్తం మీద కమ్యూనిస్టుల్లో కూడా బ్రాహ్మణీయత బలంగా ఉండటం ఇక్కడ గమనార్హం. ఒక అనధికార అంచనా ప్రకారం దేశ రాజకీయాలపై 65 70 శాతం నిర్ణయాధికారం ఇంకా కాంగ్రెస్‌ చేతిలోనే ఉందట. అంటే ఉత్తరాది బ్రాహ్మణుల చేతిలో ఉందన్న మాట. అందుకే ఆ మధ్య ఏ వెరపు లేకుండా ‘రాహుల్‌ గాంధీ' అవును నేను యూపి బ్రాహ్మణుడినే' అని మీడియా ముందు ప్రకటన చేశాడు.

కాంగ్రెస్‌ లౌకికవాద పార్టీ ముసుగుకింద రాజకీయం నెరుపుతుంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ వాద ముద్రతో రాజకీయాలు నడుపుతున్నది. ఇరు పార్టీల మధ్య నాయకులు అప్పుడప్పుడు పిరాయిస్తుంటారు. హిందుత్వ అనుకూల భాజపా సభ్యుడెవరైనా కాంగ్రెస్‌లోకి చేరగానే రాత్రికి రాత్రి లౌకికవాది ఎలా అవుతాడో, లౌకికవాద పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌కు చెందిన వారెవరైనా భాజపాలోకి చేరగానే హిందుత్వవాదిగా మారిపోతాడు. ఆయారామ్‌, గయారామ్‌లతో రాజకీయం అంతా కలగాపులగంగా ఉంటుంది.

2014 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవిర్భవిస్తుందని కాంగ్రెస్‌ అనుకూలురు బల్లగుద్ది చెప్తున్నారు. భాజపానే అత్యధిక సీట్లు సాధిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌ కొంత పుంజుకుందని ఇంకొందరు అంటున్నారు. రాహుల్‌ గాంధీ కృషే అందుకు కారణమనీ కాంగీయులు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్‌ వైపు మొగ్గుతున్నారట. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదిపార్టీ ప్రభుత్వం ముజఫర్‌నగర్‌ అల్లర్లను అదుపుచేయడంలో విఫలం కావడం, ముస్లిముల్లో పునరాలోచనకు దారి తీసిందట. ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో రామజన్మభూమి ఆలయం నిర్మాణానికి సంబంధించి ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి జారీచేసిన లేఖ సైతం సమాజ్‌వాది పార్టీకి ముస్లిములు దూరమవడానికి ఇంకో కారణం అని చెప్తున్నారు. ఇతర ప్రాంతాల ముస్లిములు మరోసారి కాంగ్రెస్‌ను ఆదరించే సూచనలు ఉన్నాయి అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక భాజపా బాగా బలపడినట్లు ఇంకో వర్గం ప్రచారం చేస్తున్నది. ఆయన ఉత్తర భారతంలో హిందుత్వ భావనల్ని గుడ్‌గవర్నెన్స్‌ నినాదాన్ని ఇంకించ గలిగారు. దానివల్ల ఆ పార్టీకి ఓట్లు, సీట్లు పెరగవచ్చునని భారతీయ జనతా పార్టీ అనుకూలుర ఉద్దేశ్యం. ఏదిఏమైనా జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య పోటీ, ఘర్షణ ఉంటుంది.

పార్లమెంటు మరో రెండు దఫాలు సమావేశం కావలసి ఉంది. ఆ సమావేశాలు సజావుగా జరిపి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లు పాస్‌ చేయించాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉండగా సాధారణ జనాలు మాత్రం ఇరు పార్టీలతో విసిగిపోయి ఉన్నారు. మూడో ప్రత్నామ్నాయం లేక ప్రతిఎన్నికలోను ఇద్దరిలో పవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలకు చెందని వారిని ప్రజలు గెలిపిస్తున్నారు. ఇలా గెలిచిన వారు గత్యంతరం, ధైర్యం లేకనో ఆశతోనో ఏదో ఒక పక్షానికి మద్దతు తెలుపుతున్నాడు.

ఈ రెండు పార్టీలు కలిసి దేశాన్ని ఆరున్నరఏడు దశాబ్ధాలు (66 ఏళ్లు) పాలించాయి. పంచవర్ష ప్రణాళికలు, ఇరవై సూత్రాలు, పంచసూత్రాలు, భారత్‌ వెలిగిపోతుంది' గరిబీ హఠావో లాంటి అనేక నినాదాలు ప్రణాళికల మధ్య పరిపాలన కొనసాగింది. 2010 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 55 శాతం మంది ఇంకా కట్టెలు,పిడకల పొయ్యిమీద వంట చేసుకుంటున్నారు. 56 శాతం మంది ఆరు బయటే కాలకృత్యాలు తీసుకుంటున్నారు. దేశంలో 20 శాతం మందికి కూడా అసలైన చదువు ఒంట బట్టలేదు. కేవలం నాలుగు శాతం మంది దగ్గరే ఏసి కార్లున్నాయి. 17 శాతం మంది దగ్గర స్కూటర్లు ఉన్నాయి. దేశంలో విద్యా, వైద్య సౌకర్యాలు పూర్తిగా బ్రష్టుపట్టి ఉన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని నగరాలలోని ప్రభుత్వ బడుల్లో పిల్లలు నేటికి క్రింద కూర్చుని అత్తెసరు పాఠాలు చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. దేశంలో 51 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.

సస్య విప్లవం, క్షీర విప్లవం వచ్చిన దేశంలో 50 శాతం మంది ప్రజలు అర్దాకలితోనే రోజులు గడుపుతున్నారు. అన్నిరంగాల్లో ప్రభుత్వ శాఖల్లో అవినీతి, కులతత్వం పెరిగిపోయింది. ఈ పరిస్థితి పట్ల పౌర సమాజం ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో పాత రాచరికమే నడస్తున్నదని, బ్రాహ్మణీయ, మతతత్వ పాలన కొనసాగుతున్నదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అధికార పక్షం ప్రతిపక్షం కలిసి పేద, మధ్య తరగతి ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయి. ఎవరికి వారు స్వలాభాపేక్షతో పనులు చేస్తున్నారు.

ఢల్లీిలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) దూసుకెళుతున్న తీరు చూస్తున్నప్పుడు ఆ రెండు పార్టీల పట్ల ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయని అవగతం అవుతుంది. ‘వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ, జనతాదళ్‌ (యునైటెడ్‌), బిజూ జనతాదళ్‌ (బీజేడీ) నాయకులు ఇటీవల ఢల్లీిలో సమావేశమైన తృతీయ కూటమిగా ఏర్పడే విషయమై చర్చించారు. కానీ, ఆ పార్టీలన్నీ కొన్ని రాష్ట్రాల్లో పరస్పరం పోటీపడుతున్నవే. అలాంటప్పుడు వాటిమధ్య ఎన్నికల ముందు పొత్తు సాధ్యపడదు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో పొత్తూ పెట్టుకొని కాంగ్రెస్‌తో పోటీపడే అవకాశముంది. తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగే పరిస్థితి ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీలు చాలా చిన్నవి. పంఐపం ఎటూ తిగిరి కాంగ్రెస్‌ నీడకే చేరుతుంది. వైఎస్‌ఆర్‌ పార్టీ కాంగ్రెస్‌ను కాదని కేంద్ర రాజకీయాలను చేయలేదు.

ఎన్నికల్లో ఏ మేరకు సీట్లు సాధించగలవన్నదాన్ని బట్టి అవి ఏకతాటి మీదకు రాగలవా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పక్షాలు ఎక్కువగా సీట్లు సాధించినప్పటికీ కాంగ్రెస్‌ లేదా భాజాపా మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే. 2014లో మనకు ఈ రెండు పక్షాల్లో ఏదో ఒక పార్టీ పాలకులుగా అవతరించే అవకాశం ఉంది. గతంలో జరిగినట్లే 2014లో కూడా ఆమ్‌ ఆద్మి అమాయకుడిగా మిగిలిపోతాడు. బ్రాహ్మణీయ వాద పార్టీలు, బీసీలకు పంచాల్సిన అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు.

- దుర్గం రవిందర్‌
రచయిత సీనియర్ జర్నలిస్టు

English summary
Senior journalist Durgam Ravinder has given extensive politicalpicture on the pre election scenario in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X