వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామజ్యోతి: సినిమా సెట్టింగ్‌ల్లాంటి ఊళ్లలోకి..

By Pratap
|
Google Oneindia TeluguNews

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రజను భాగస్వామ్యం చేసేందుకే ‘గ్రామజ్యోతి' కార్యక్రమంను రూపొందించారు. ఆగస్టు 15న గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తున్నారు, ఆగస్టు 17న గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యాచరణను మొదలు పెడుతున్నారు. మంత్రలు, పమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎక్కడికక్కడ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆగస్టు 17 నుంచి 24 దాకా గ్రామజ్యోతి వారోత్సవం నిర్వహిస్తున్నారు. ‘గ్రామజ్యోతి అంటే గ్రామాలకు నిధును కేటాయించడమే కాదని ప్రతి పౌరుడ్ని చైతన్యపరిచి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారథు కావాని' ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెంగాణా సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులకు ప్రజ సంఘటిత శక్తి తోడైతేనే మార్పు, ప్రగతి సాధ్యమౌతుంది. మార్పు సాధకులు ప్రజలే. ప్రభుత్వ కార్యక్రమంగా ఈ పథకముంటే ఫలితం రాదు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును ఇస్తూ సదుపాయాలు కల్పించేందుకే ఉండాలి. గ్రామాభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికు రూపొందించుకోవానేది అధికాయి ప్రజకు చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులతో ఈ విషయమై ఆగస్టు తొలి వారంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ప్రతి గ్రామానికీ వచ్చే ఐదేళ్ల అభివృద్ది ప్రణాళిక సిద్ధం కావాలి. సంఘటిత శక్తిలోని గొప్పతనాన్ని గ్రామీణ ప్రజలు గుర్తించాలి. క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా ప్రజను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు సాగాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధి ప్రణాళికు రూపొందించుకోవడాన్ని నేర్పాలి. స్థానిక సంస్థ ద్వారా వివిధ పథకాతో వేల కోట్లు ఖర్చవుతున్నా ఆస్తుల సృష్టి జరగడం లేదు.

Durgam Ravinder on Telangana Grama Jyothi programme

గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాను రూపొందించాలి. నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల నియామకాలతోపాటు ఇతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలోని పలు గ్రామాలు సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుందాం. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌, వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి గ్రామీణ అభివృద్ధికి చక్కటి ఉదాహరణలు. కరీంనగర్‌ జిల్లాలోని ముల్కనూరు సహకార వ్యవస్థకు నిలువుటద్దం ఇలాంటి ఉదాహరణు మనకెన్నో ఉన్నాయి.

మొదటి దశలో ప్రజలు గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి. గంగదేవిపల్లి గ్రామంలో వలె కమిటీలు వేసుకుని ప్రజ భాగస్వామ్యం పెంచాలి. గ్రామ పంచాయతీ నిధు బాధ్యతపై విధివిధానాలను రూపొందించి ఖచ్చితంగా అమయ్యేలా చూడాలి. స్థానిక సంస్థకు రావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన అధికారుంతా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని మార్పునకు మార్గదర్శకం కావాలి. మండలానికో జిల్లా స్థాయి అధికారి బాధ్యుడిగా ఉండాలి. వీరి ఆధ్వర్యంలోనే గ్రామ సభ జరగాలి. నిర్లక్ష్యానికి గురైన దళితవాడలు, గిరిజన తాండాలపై సంచార కులాల వారు, వృత్తిని కోల్పోయిన కులాల వారిపై ప్రత్యేక దృష్టి నిపాలి. ‘అభివృద్ధి కోసం గ్రామ ప్రణాళికు సిద్ధం చేయడంతోపాటు శ్రమదానంతో కొన్ని పనులు చేయాలి' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలోని పది జిల్లాల్లో 8,687 పంచాయతీలున్నాయి. 9834 జనవాస గ్రామాలున్నాయి. దాదాపు పదివేలు అనుకోవచ్చు. 600 జనం లేని (బేచిరాగ్‌) గ్రామాలున్నాయి. 459 మండలాలున్నాయి. అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. తెలంగాణ పునర్నిర్మాణానికి గ్రామజ్యోతి కార్యక్రమం నాంది కానుంది.

తెంగాణలో కొన్ని గ్రామాలు కనీసం వెయ్యి ఏళ్ళ వయసున్నవి ఉన్నవి. దుద్దెడ, బెజ్జంకి, పొవాస, అలంపూర్‌, పాకాల, నకిరేకల్లు, ఇందూర్‌, బోధన్‌, బైంసా, ముథోల్‌ లాంటి గ్రామాల వయస్సు సహస్రాబ్దం కన్నా ఎక్కువే. ఈ గ్రామాల్లో అద్భుతమైన సంస్కృతి ఉంటుంది. గ్రామ నిర్మాణం, పాలనా పద్ధతులు బాగుంటాయి. గ్రామంలో బొడ్రాయితోపాటు రెండు లేదా మూడు చెరువులతోపాటు గుడి, బడి, గడి, దుకాణం, కరణం ఇల్లు, మాపల్లె, మాదిగవాడ, ముత్రాసీలు, గుండ్ల్లోల్లు, వడ్ల, కుమ్మరి, కంచరి, కంసాలిలు, కమ్మరి, చాకలి, కోమటి, కాపు కులాలు వారి ఇండ్ల కూర్పు శాస్త్రీయంగా ఉంటుంది.

తెంగాణాలో వెయ్యేళ్లపైగా చరిత్రగల ఒక్కో గ్రామం సజీవ ప్రదర్శనశాలగా ఉంటుంది. కొన్ని గ్రామాలు సినిమా సెట్టింగుల్లా ఉంటాయి. ఇలాంటి గ్రామాలు ప్రపంచంలోనే అరుదుగా ఉంటాయి. గ్రామాల్లో కులాల మధ్య వ్యవహారాలు, బంధుత్వాలు, పంచాయతీలు, పండుగలు, అన్ని ఒక పద్ధతిగా ఉంటాయి. ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీ అవడంతో గ్రామాల ఎదుగుదల ఆగిపోయింది.

1956 తర్వాత గ్రామాలు మరింత గిడసబారాయి. సీమాంధ్రులవ స్వార్థంతో తెంగాణ గ్రామాలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ఈ సమస్యను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో మన ఊరు ` మన ప్రణాళిక ప్రారంభించింది. సరైన ప్రణాళిక ఉంటే అభివృద్ధి సరిగా ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళిక రూపొందించి సరిపడ ఖర్చు చేస్తే ఫలితం బాగుంటుందని ముఖ్యమంత్రి అప్పుడు మన ఊరు - మన ప్రణాళికను ప్రారంభిస్తూ అన్నారు.

గ్రామజ్యోతి దానికి కొనసాగింపే. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేసేది. ఈ నిధులు సద్వినియోగం కావడం లేదని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పుడు నేరుగా గ్రామ పంచాయతీలకే డబ్బును ఇస్తానని ప్రకటించింది. ఈ నిధువల్ల కలిగే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడానికి హడావిడిగా గ్రామ జ్యోతిని వెలిగిస్తున్నదనే విమర్శలు వచ్చాయి.

తెంగాణలో గ్రామాలు, చిన్న పట్టణాల పరిస్థితి దయనీయంగా ఉంది. సెవన్‌ సీటర్‌, షేర్‌ ఆటో పుణ్యాన గ్రామీణ ప్రాంతాల్లో నగరశివారుల్లో రవాణా సమస్య కొంత తీరింది. కానీ ఇతర సమస్యలు అలాగే ఉన్నాయి. విద్యా, వైద్య సౌకర్యాలు దయనీయంగా ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు తెగిపోయాయి. ఉన్న చెరువుల్లో పూడిక నిండింది. బావులు, వాగుసు, కుంటలు ఎండిపోయాయి. గొట్టపు బావులకు అవసరమైన విద్యుత్‌ ఇబ్బందుల్లో పడింది. మొత్తం మీద గ్రామీణ తెలంగాణం కష్టాల్లో కూరుకుపోయింది. గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రభుత్వం చెబుతున్నంత కాకపోయినా కొంతైనా సఫలమైతే గ్రామాలు ఎంతో కొంత బాగుపడతాయి.

- దుర్గం రవిందర్‌, సీనియర్‌ జర్నలిస్టు

English summary
A senior journalist Durganm Ravinder gives road map to develop Telangana villages with Grama Jyoyji programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X