వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వ వికాసం: అమ్మ ప్రేమ, అమ్మ కోపం

By Pratap
|
Google Oneindia TeluguNews

నేను చిన్నప్పుడు వద్దన్న పనులు ఎన్నో చేశాను. ఇతరుల ఇళ్లల్లోని జామచెట్ల కాయలను ప్రహరీగోడ ఇవతలనుండి అందుకొని తెంపుకొనేవాళ్ళం. అలాగే గన్నేరు పూలను తెంపుకొచ్చేవాళ్లం. ఇంటివాళ్ళు ఎవరో తెంపుకు పోతున్నారని తిట్లు తిట్టేవారు. ఆ తిట్లు ఒకవైపు భయాన్ని, మరొకవైపు సంతోషాన్ని కలిగించేవి. దొరికితే తంతారు. దొరక్కుండా తప్పించుకోవాలి.

దొరికితే తంతారు అనేది భయం. దొరక్కుండా తప్పించుకోవడం ఒక సాహసం. కష్టాల్లో, భయంలో మనసు వేగంగా ఆలోచిస్తుందేమో. చకచకా నిర్ణయాలు తీసుకొని దొరక్కుండా పారిపోయేవాళ్లం.
సాహసం, ధైర్యం, మంచి విషయాలవైపు మళ్లించడానికి చెడును, అనర్ధాలను చెప్పడం కాకుండా, మంచి విషయాలను చెప్పడం ద్వారా మళ్లించాలి.

కోపానికి రావడం, ఆధిక్యత ప్రదర్శన మాత్రమే కాదు

కోపానికి రావడం, ఆధిక్యత ప్రదర్శన మాత్రమే కాదు. ఇరిటేషన్‌ వల్ల చెప్పింది చేయడంలేదని భావం వల్ల కోపం రావచ్చు. ఎదుటివారిపట్ల చిన్న చూపు ఉండడంవల్ల కోపం రావచ్చు. కానీ కోపం రావడం అనేది ఎదుటివారు వేస్తున్న ప్రభావం కూడా. వాళ్ళు చేసే పనులు మనకు కోపం తెప్పిస్తున్నాయంటే వాళ్ళు తమ పనుల ద్వారా మనపై ఎంతో ప్రభావం వేస్తున్నారు. అలా పిల్లల చర్యల ద్వారా ప్రతిచర్యగా వ్యక్తిత్వాలు మారిపోతుంటాయి. ఎదుటివారిని రెచ్చగొట్టడం ద్వారా వారిని ప్రభావితం చేయవచ్చు.

ఇలా పెద్దవాళ్లు తిట్టే తిట్లు, పెద్దవాళ్ల కోపం పిల్లలకు చాలా ఆనందం కలుగుతుంది. తమ చేష్టలు, మాటలు పెద్దవాళ్లను అంత ప్రభావితం చేస్తాయని, వాళ్ల తిట్లు, వాళ్ల కోపం ద్వారా తెలిసిపోతుంది. కనుక పెద్దవాళ్లకు కోపం తెప్పించాలని వీపు విమానం మోత మోగినా తమ మాటల చేష్టల ప్రతాపం స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటారు పిల్లలు.

Personality development: Positive and negative suggestions

ప్రతికూల విషయాలు చెప్పడం

అబద్దం ఆడరాదు. సత్యం పలకవలెను అనేవి రెండూ ఒకటి కాదు. అబద్దం ఆడరాదు అనేమాటకు ఎందుకు అబద్దం ఆడరాదో రకరకాల కారణాలు చెప్తారు. అవన్నీ చెడు ఫలితాలకు సంబంధించినవి. అబద్ధం ఆడిచూస్తా అని సాహసానికి వెళ్ళవచ్చు. సత్యంనే పలకవలెను అని చెప్తే సత్యం వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయో చెప్పడం ద్వారా మంచి మాత్రమే తెలుస్తుంది. అపుడు సత్యాన్ని పలకడం, మంచిని చేయడం, జీవితాశయంగా మలుచు కుంటారు.

అపుడపుడు అమ్మ అన్నీ తిట్టిపోశాక కూడా పిల్లలు మొండిగా వినక కొట్టడానికి చేతికి అందక పరిగెడుతుంటే... నీ బాంచను రా... మా నాన్నవు కదా... మా అమ్మవు కదా... అని మళ్లీ బతిమాలి పిలుస్తుంది. కొట్టను అని హామీ ఇచ్చాక దగ్గరకు వస్తారు. అప్పుడు తల్లి మురిపెంగా దగ్గరికి తీసుకుంటుంది.

అమ్మ ప్రేమ, అమ్మ కోపం

ఈ క్రమంలో తల్లీపిల్లలమధ్య కోపం, తిట్లు, అలక, బెట్టు రూపంలో సమానత్వం కొనసాగుతూ ఉంటుంది. అమ్మ తమను ప్రేమిస్తుంది అని పిల్లలు గ్రహిస్తారు. అందుకే ప్రేమించే అమ్మలు ఎన్ని తిట్టినా నెత్తిలో పేన్లు కుక్కినంత కమ్మగా, హాయిగా నవ్వుకుంటారు పిల్లలు. ప్రేమలేని కోపం, తిట్లు, కొట్టడం ద్వేషాన్ని రగిలిస్తుంది. శత్రుత్వాన్ని పెంచుతుంది. అలా కూడా నెగెటివ్‌ పద్ధతిలో వ్యక్తిత్వంలో సొంత ఒరవడి మొదలవుతుంది.
తల్లికుక్క తన పిల్లలకు పాలిచ్చేటప్పుడు అనేక విధాలుగా ఆటపాటలు, పరుగులు, పోట్లాటలు, అరవడం, కరవడం నేర్పుతుంది. తల్లి కోడి తన పిల్లలకు ఇలాగే అనేక విషయాలు నేర్పుతుంది. అమ్మ కూడా ఇలాగే అనేక విషయాలు నేర్పుతుంది. ఇలా అమ్మద్వారా భాష, భావ వ్యక్తీకరణ, హృదయ స్పందనలు, సంస్కృతి నేర్చుకుంటూ వస్తుంటాం.

అమ్మ పిల్లలకు చెప్పడం ద్వారా, అనునయించడం ద్వారా, ప్రేమించడం ద్వారా తనను తాను తెలుసుకుంటుంది. తనను తాను మలుచుకుంటుంది. తనను తాను ప్రేమించు కుంటుంది. తనను తాను ఎదిగించుకుంటుంది. అలా తల్లీ పిల్లల వ్యక్తిత్వ వికాసం జరుగుతూ ఉంటుంది. తల్లి కాకముందు ఆమెకు ఇవేవీ తెలియవు. పిల్లల ద్వారానే వాటన్నిటిని నేర్చుకుంటూ అమ్మగా, ఆదర్శమూర్తిగా ఎదుగుతూ ఉంటుంది. నాయకులు కూడా, నాయకత్వం కూడా కార్యకర్తలు, అనుచరులు, సహచరులు లేకముందు వారికి తల్లికాక ముందు వలెనే చాలా విషయాలు తెలియవు. అనుచరులు, సహచరులు, కార్యకర్తల ద్వారానే చేరిన కొద్ది అమ్మలాగే ఎదుగుతుంటారు. తమను తాము మలుచు కుంటారు.

కార్యకర్తల పట్ల, అనుచరులపట్ల, నాయకుడు ప్రేమ

అందువల్ల ఒక నాయకుడు మాట్లాడే తీరులో ప్రవర్తించే తీరులో కార్యకర్తలను, సహచరులను, అనుచరులను, అభిమానులను గౌరవించే తీరులో, తిట్టే తీరులో, పనిచెప్పే తీరులో, ప్రేమించే తీరులో వారి స్వభావాలు తెలుస్తుంటాయి. వారు ఏమేరకు ఎదిగారో, వారి శక్తి సామర్ధ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తాయి.
బాగా అరిచేవారు, కరిచేవారు, ఇతరులపై ఫిర్యాదు చేసేవారు తమకు అనుచరులు, సహచరులు, కార్యకర్తలు చాలా తక్కువ అని తమకు తామే చెప్పుకున్న వాళ్లవుతారు. తమమీద తమకు నమ్మకం లేనివాళ్ళు, తాము చెప్పేదానిపట్ల తమకే నమ్మకం లేనివాళ్ళు ఇతరులు వారిని వ్యతిరేకించినపుడు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తారు.

English summary
An emeinent writer BS Ramulu opins childhood positive and negative suggestions play main role in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X