వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': రిపేరు చేయబడును

By Pratap
|
Google Oneindia TeluguNews

వెధవ ప్రపంచంలో ఏది శాశ్వతం?... అటూ చిరిగిన బొంతకి మాసికలేసు కుంటూ వుండేది మా బామ్మ... నిజమేస్మీ! ఎంత విలువైన వస్తువైనా కాలదోషం పట్టకా తప్పదు, మనమ్మరామత్తు చేసుకోకా తప్పదు...

అసలు ఏకంగా లోకాన్నే మరమ్మత్తు చేయ సంకల్పంచేసిన మహానుభావుడు గిరీశం... డామిట్‌ కథ అడ్డం తిరిగింది గనక బతికిపోయాం!

జనరల్‌గా ప్రభుత్వం వారు ఆనకట్టల్ని రిపేరు చేయిస్తూ వుంటారు... నేను పుట్టినప్పట్నించీ అలా రిపేరు చేస్తూనే వున్నారు...

సైకిలు కొన్న కొత్తల్లో రయ్‌న బాణంలా దూసుకెళ్తుంది. కొన్నాళ్ళకి సంగీతం నేర్చుకున్నట్లు కరకరమంటుంది. దడదడమంటూంది... ఎక్కడో చతికిలబడుతుంది... అప్పుడు రిపేరు తప్పదు గదా?

Tanikella Bharani

మా కొంపలో ఇక్ష్వాకుల కాలంలో కొన్న టేబుల్‌ఫాన్‌ వుంది... అప్పట్నించీ కాలచక్రంతోపాటు అదీ తిరిగీ తిరిగీ ఓరోజు టక్కున ఆగిపోయింది... వెంటనే దాన్ని రిపేరుకి తీసికెళ్ళా... వాడు ఏ కీలుకా కీలు ఊడదీసి ఇప్పుడు దీని స్పేర్‌పార్ట్స్‌ దొరకవ్‌... అని ఓ మూటకట్టి నా చేతిలో పెట్టాడు... సరే ఇహ తెగించి ఓ సండే నేనే రిపేరు మొదలెట్టా... వొళ్ళంతా నూనెడాగులు చేసుకుని సాయంత్రానికల్లా బిగించి స్విచ్‌ వేశా... ఢాం! అని శబ్దమయింది ఫ్యానులోంచి పొగలూ... ఇహ శాశ్వతంగా పనికిరాకుండా పోయింది...?

ఇలాగే మా బాబాయ్‌గారొహరున్నారు... ఆయన నాకు జ్ఞానం వచ్చినప్పట్నించీ ఒకే చెప్పుల జత వాడుతున్నారు. తెగినప్పుడల్లా తనే ఓ తోలుమక్క వేసి కుట్టుకుంటాడు... మధ్యలో ఎక్కడన్నా వూడిపోతుందన్న బెంగతో జేబులో కాసిని మేకులు పొట్లం కట్టిపెట్టుకునేవాడు.... తీరిక దొరికితే చాలు పాదరక్షలు రిపేరు ఆయనకి హాబీ!...

అయతే ఈ రిపేర్లనేవి కేవలం వస్తువులకే పరిమితం కావుగా పంటికి రిపేరు... కంటికి రిపేరు... వొంటికి రిపేరు... బుర్రకి రిపేరు...

విదేశాల్లో కార్లుగనుక చెడిపోతే వాటిని అవతల పారేస్తారట. ఎంచేతంటే ఆ రిపేర్లకి అయ్యే డబ్బుతోటి... కొత్త కారొకటి కొనుక్కోవచ్చని... అలాగే మొగుడు కాస్త చెడిపోతే వాణ్ని వదిలేసి మరొకడితో చక్కా పోతారు. ఇందుకే గాబోలు... ఇహ వాళ్ళని ఎవరు రిపేరు చెయ్యగల్రూ!...

English summary
Tollywood actor and an eminent Telugu prose writer Tanikella Bharani speaks about the repairs of goods in his Samanaya suktam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X