వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': చద్దన్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

చద్దివణ్ణం తింటారా?... అని బుచ్చమ్మ అడిగితే గిరీశం యావన్నడూ యంతమాత్రం అభ్యంతరంలేదూ అన్లా... పరగడుపునే ఇంత కమ్మటి పెరుగూ అంత ఆవకాయీ కలిపి చద్దనం లగాయిస్తే... ఆ మజా వుంది చూశారూ... అబ్బో!...

ఎండాకాలంలో తరవాణీ కుండలోంచి చద్దన్నం దేవుకు తింటే కడుపులో ఎంతచల్లగానో వుంటుంది... అయితే కమ్మటి నిద్రపడ్తుంది అని డేంజరే... నేనెప్పుడేనా ఆఫీసులో ఆవలిస్తే మా బాసు చద్దన్నం తిన్నావా మిస్టర్‌ అంటూ కసురుకునేవాడు...

Tanikella Bhranai

ఈ వెధవ టిఫిన్లొచ్చాక చద్దన్నం అలవాటు పోయింది... ఎవడు తింటాడా వెధవచద్దన్నం అన్జెప్పి పిల్లలగోల... దాంతో చద్దన్నం కరుడు రాత్రిళ్ళు తీసికెళ్లి పనిమనిషికి పెట్టడమో... కుక్కలకీ నక్కలకీ పారెయ్యడమో జరుగుతోంది... మొన్నో బిచ్చగాడికి చద్దన్నం వేస్తే.. దాంతో వేడి సాంబారైనా పోయించండి ఇలా ఎలా తింటా అని కసురుకున్నాడు... రాత్రిళ్ళు అంతా కలిసి తింటారని నానారకాలైన పదార్థాలూ చేస్తుంది ఆవిడ... పెద్ద వెధవ రాత్రిళ్ళు ఏ డిన్నరుకో తగలబడి కొంపకు రాడు. దాంతో బోడ్లు అన్నం వేస్టూ... దాన్ని రాత్రికి కారీడ్‌ ఓవర్‌ చేసుకుని... పొద్దున్నకి బ్రాట్‌ఫార్వర్డ్‌ జేసుకోడం... మాయింట్లో చద్దన్నం చస్తే తినం... మిగిల్తే అవతల పారేస్తాం అనీ స్టయిలుగా చెప్తుంది ఓ మహా యిల్లాలు... పుట్టింటినించి బియ్యబ్బస్తా తేరగా వొస్తే... మా ఆవిడా పారేస్తుంది.

ఈ చద్దన్నం ద్వేషులూ... రైళ్ళలో ప్రయాణాలు చేసేటప్పుడు పట్లాలు కొంటారు... సాంబార్‌ అన్నం అనీ... తేర్‌సాదం అనీ... అదేవిటీ... చద్దన్నంకాదూ... వాళ్ళూ దాన్ని ఆప్యాయంగా తింటుంటే నాకు భలే జాలేస్తుంది... పొద్దున్నే చద్దన్నం తింటే ఓ పట్టాన ఆకలెయ్యదు... అందుకే చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలెరగదని సామెత పుట్టింది గాబోలు...

మన రైతులు చద్ది కట్టుకు పోతారు గనుక అంత శ్రమపడతారేమో... ఏమైనా పెద్దాళ్ళమాట చద్దన్నంమూట అని చెప్పారు... యిస్‌!

English summary
Tollywood actor and eminent writer Tanikella Bharani writes about Chaddi rice in his Samanaya suktam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X