అంబాసిడర్ నుండి బెంజ్‌లోకి: నిజమైన సోదరి కల

బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు విలువ రూ.10 లక్షలలోపు ఉంటుందేమో. కానీ, ఈ బెంజి కారు విలువ పన్నెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రణబ్ అందులోకి అడుగుపెట్టిన వెంటనే తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి. కారులో రాష్ట్రపతి కూర్చునే భాగం వేరు. డ్రైవర్ కేబిన్ వేరు. మధ్యలో సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. అక్కడ టీవీ ఉంటుంది. 14 స్పీకర్లు ఉంటాయి. ఈ కారు ఎంత భద్రం అంటే.. బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు.. గ్రనేడ్ దాడులు, మందుపాతరలు పేల్చినా దానికి ఏమీ కాదు. ఒక్కటనేమిటి.. జిపిఎస్ సహా అత్యాధునిక సౌకర్యాలు ఆ కార్లో ఉంటాయి.
కుటుంబ సభ్యుల ఆనందం
ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం పట్ల కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ప్రణబ్ ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తానని ప్రణబ్ కూతురు చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారని, తన తండ్రి గెలుపుతో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లు తన మాటలు నిజమయ్యాయని ప్రణబ్ సోదరి అన్నపూర్ణ బెనర్జీ ఆనంద పడుతున్నారు.
చాలా ఏళ్ల కిందట.. అప్పట్లో ప్రణబ్ యువ ఎంపీగా ఉన్నప్పుడు ఓరోజు వాళ్ల బంగ్లా వరండాలో తామిద్దరం కూర్చుని టీ తాగుతున్నామని, అక్కణ్నుంచి చూస్తే రాష్ట్రపతి భవన్‌లోని గుర్రపుశాల స్పష్టంగా కనిపిస్తోందని, ప్రణబ్ ఆ గుర్రాల్ని చూస్తూ... ఎంత హాస్యాస్పదమో చూడమని తనతో అన్నారని, ఆ గుర్రాలకు చేసే పనేమీ ఉండదని, రోజంతా చక్కగా మేపుతారని, మళ్లీ జన్మంటూ ఉంటే ఆ గుర్రాల్లో ఓ గుర్రంలా పుట్టాలని కోరుకుంటున్నానని ప్రణబ్ తనతో అన్నారని సోదరి అన్నపూర్ణ అన్నారు.
అప్పుడు నాబం గుర్రంలా ఏం ఖర్మ.. ఏదో ఒకరోజు ఈ దేశానికి రాష్ట్రపతివే అవుతావని అన్నానని, అది నిజమైందని అన్నపూర్ణ గతాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ విజయం సాధించారని తెలిసిన వెంటనే, తనకెంతో ఆనందంగా ఉందన్నారు. చిన్నప్పుడు స్కూలుకు వెళ్లనని మారాం చేసేవాడని, ప్రణబ్‌ను స్కూలుకు పంపడం ఓ ప్రహసనమేనని, ఓసారి తమ అమ్మ ప్రణబ్‌ను చితక్కొట్టేసిందని, దాంతో స్పృహ కోల్పోయాడని, అయినా వెళ్లేవాడు కాదని గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రణబ్‌కు దైవభక్తి ఎక్కువేనని, రోజూ పూజ చేసేవారని చెప్పారు.
ప్రజా జీవితంలో ఆయనకు చాలా పెద్ద హోదా ఉన్నప్పటికీ.. ఆయన చాలా జోక్స్ వేస్తారని చెప్పారు. రాత్రి 11 దాటాక మనవలతో కలిసి ఆడుకుంటారని, పద్యాలు చెబుతారని, జోక్స్ పేలుస్తారని వివరించారు. ఆదివారమంతా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీ ముందే కూర్చున్నారు. ఫలితం తెలిసిందే అయినా ప్రకటించే వరకూ ఉత్కంఠగానే ఉన్నామన్నారు. తన ఆరోగ్యం బాగా లేదని, అందువల్ల ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లలేనని చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications