వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేసేందుకు తరలిన సీమాంధ్రులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 13 జిల్లాల్లో బుధవారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు లక్షలాదిగా తరలి వెళ్లారు.

ఈ నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో సీమాంధ్ర ప్రజలు చేరుకోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. మంగళవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యారు.

రైలు కిక్కిరిపోవడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు సైతం రైలు ఎక్కలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు శాంతించారు. ఎన్నికల వేల అదనపు రైళ్లు నడపక పోవడంపై రైల్వే అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గతంలో జరిగిన ఏ ఎన్నికలకు కూడా ఇంత భారీగా సీమాంధ్ర ప్రజలు వెళ్లలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2009లో ఎన్నికల సమయంలో సీమాంధ్రులు ఇంతలా తమ సొంతూళ్లకు వెళ్లి ఓటేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తమ ఓటు హక్కును తాము వలస వచ్చిన ప్రాంతంలో వినియోగించుకునే కంటే సొంత ఊరిలో వేయాలనే ఉద్దేశంతోనే సీమాంధ్రులు ఇంత భారీస్థాయిలో వెళ్తున్నారనే వాదన వినిపిస్తోంది.

సీమాంధ్ర సెంటిమెంటుకు తోడు.. సొంతూరికి వెళ్లిరావడానికి, దారి ఖర్చులకు, ఓటేసినందుకు వివిధ పార్టీలు డబ్బులు ఇస్తుండడం తమకు కలిసివస్తోందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా సొంతూరికి వెళ్లొచ్చినట్టు ఉంటుందని భావించడంతో చాలా మంది కుటుంబసమేతంగా వెళ్లడం కూడా రద్దీ పెరగడానికి కారణమైంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 13 జిల్లాల్లో బుధవారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు లక్షలాదిగా తరలి వెళ్లారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

అత్యధిక సంఖ్యలో సీమాంధ్ర ప్రజలు చేరుకోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు

మంగళవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా ప్రయాణికులు చేరుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రైల్వే స్టేషన్ చేరుకుంటున్న ప్రయాణికులు

రైల్వే స్టేషన్ చేరుకుంటున్న ప్రయాణికులు

గతంలో జరిగిన ఏ ఎన్నికలకు కూడా ఇంత భారీగా సీమాంధ్ర ప్రజలు తమ ప్రాంతాలకు వెళ్లలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబ సమేతంగా...

కుటుంబ సమేతంగా...

సీమాంధ్ర సెంటిమెంటుకు తోడు.. సొంతూరికి వెళ్లిరావడానికి, దారి ఖర్చులకు, ఓటేసినందుకు వివిధ పార్టీలు డబ్బులు ఇస్తుండడం తమకు కలిసివస్తోందని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా సొంతూరికి వెళ్లొచ్చినట్టు ఉంటుందని భావించడంతో చాలా మంది కుటుంబసమేతంగా వెళ్లడం కూడా రద్దీ పెరగడానికి కారణమైంది.

English summary
The Hyderabad and Secunderabad cities have witnessed an exodus of nearly 3 lakh Andhra-bound voters towards Seemandhra districts, especially Praka-sam, Guntur, Krishna and East and West Godavari districts, in the last three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X