కందుకూరి రమేష్ బాబు 'ఆర్డినరీనెస్ ఆఫ్ ట్రూత్': కవి ఎంఎస్ నాయుడు స్పందన..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సహజత్వాన్ని ఒక ఫ్రేమ్‌లో బంధించాలంటే కళ్లెదుట దృశ్యాన్ని హృదయంతో చూడగలిగాలి. హృదయ స్పర్శను పొదువుకున్న ఛాయాచిత్రం మాత్రమే వీక్షకుడిని సహజానుభూతికి లోను చేస్తుంది. అలాంటి దృశ్యాన్ని వెతికిపట్టి బంధించాలంటే హృదయ సంచారం అవసరం. కందుకూరి రమేష్ బాబులో ఈ విశిష్ట లక్షణాలన్ని ఉన్నాయి కాబట్టే ఆయన ఫోటోగ్రఫీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.

మణికొండలోని ఓయూ కాలనీలో ఉన్న సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీలో 'ఆర్డినెస్ ఆఫ్ ట్రూత్' పేరిట ఆయన ఛాయాచిత్రాల ప్రదర్శన కొనసాగుతోంది. ఆగస్టు 19వ తేదీ సాయంత్రం మొదలైన ఈ ఎగ్జిబిషన్.. సెప్టెంబర్ 20వరకు కొనసాగనుంది. ఛాయా చిత్రాలను తిలకించాలన్న ఆసక్తి ఉన్నవారెవరైనా సరే సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించవచ్చు.

 poet ms naidu response on kandukuri ramesh babu art gallery

ఎంఎస్ నాయుడు స్పందన:

సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన తర్వాత ప్రముఖ కవి ఎంఎస్ నాయుడు తన అనుభూతిని అక్షరాల్లోకి తర్జుమా చేశారు. సెలవు చెప్పని నిశ్చలనాలు పేరిట ఆర్ట్ గ్యాలరీపై తన స్పందన తెలియజేశారు.

*సెలవు చెప్పని నిశ్చలనాలు*

కొన్నింటిని చూడలేం. చూడటం చర్యే కాదు కొందరికి. చూస్తూ ఉండేవి దక్కవు అందరికీ.
చిక్కుకుపోయే జీవితపు చిందుల్లో మునకలేస్తుంటాం. తేరిపార బతుకుతుంటాం.
నేత్రాలన్ని శిలఫలకాల్ని చేసి. ఆ అనాకర్షణేదో చొచ్చుకుపోతోంది మారుమూలను్న మనసు పటాల పైనుంచి.

నగరపు చిట్టడివిలో చిట్టెలుక బంధీ కావొచ్చు, చిట్టి చేపలు ఎండనూవొచ్చు. ఒక్క నమస్కారంతో ఎంత బరువైనా మోయొచ్చు ఈ పడుగు పేకలు చీలుస్తుంటే.

 poet ms naidu response on kandukuri ramesh babu art gallery

చీకటిని ఎవరు తిన్నారో?
చీకటిగా ఎవరు నవ్వారో?
చీకటితో ఎవరు గెంతారో?
చీకటి బుట్టలో కన్నీళ్లని ఎవరు తొంగిచూసారో?
అంటనంత బురద ప్రతి తలపు వెనుకఅందనంత మర్యాద ప్రతి నడక వెనుక
దేన్ని నిక్షిప్తం చేయకు. దేన్నీ ఆరేయకు. దేన్నీ విరగ్గొట్టకు. వొదిలిపెట్టు దేన్నైనా ఏడుపుగొట్టులా.

నిన్ను పీల్చుకునే నిశ్శబ్దాలు
నిన్నే దాచుకునే పరిమళాలు
నీలోని నువ్వు నిన్నో గుమ్మానికి తగలించుకుంటావు

 poet ms naidu response on kandukuri ramesh babu art gallery

నీ కౌగిలిలో ఏ పిల్లీ తలదాచుకోదు
నీ దోసిలిలో ఏ ముఖమూ తలవొంచుకోదు
ఎగిరెగిరిపడే సూర్యుని చేతిలో చీమవు కాస్త నవ్వుకోరాదూ కాకిలా
కాస్త కాలిపోరాదూ వృద్దాప్యంలా
కాస్త వినిపోరాదూ పొగలా
ఈ పోగేసిన చిత్రాల వెంట

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After visitng the Kandukuri Ramesh Babu art gallery, Poet MS Naidu shared his opinion on that.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి