హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్వాణ సుఖ ఛాయ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇటీవల ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సామాన్యశాస్త్రం రచయిత, ఫొటో జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు ప్రదర్శించిన SINGLE EXHBIT పై ఒక ప్రసిద్ద కవి సంక్షిప్త సంస్పందన.

ఏదైనా వొక కళలోకి ప్రవేశించాలంటే...జీవితం పట్ల విపరీతమైన మక్కువ, ప్రేమ, గాఢానురక్తి ఉండి తీరవలసిందే. నువ్వు పాడు ఆడు, రాయి, కూతతో కులాటీలు కొట్టు, కుంచెతో కూజితాలు వెయ్యి, లోవెలుపలి దృశ్యాపదృశ్య జలపాతాల కింద తలపెట్టి నిద్రపో..., ఎంతగా బతుకును ప్రేమించాలంటే కళాకారుడు పూర్తిగా నిర్మూలం అయిపోవాల్సిందే. తను జీవితం ముందు ఏమీ లేకుండా సాక పోసి సాగిలపడవల్సిందే. జీవితంతో నువ్వు ఎప్పటికీ సెల్ఫీ తీసుకోలేవు.

Sidhartha on Kandukuri Ramesh babu's single exhibit

తీసుకున్నావా...Artistవి కాలేవు. ఎంతో సాధన చేసి, ఎన్నో కష్టాలు పడి జీవించిన ఆ కొద్ది రోజుల సమూహంలో నువ్వు ఉండకూడదు. అప్పుడే ఆ ఆర్ట్‌లోని నిర్వాణ సుఖ ఛాయ తెలిసోస్తుంది. Momentary bliss లోని శూన్యత గొప్ప విభావరీ ప్రాప్తి కళాకారునికి. ఆ అనుభవాన్ని దాటి వస్తే కానీ గుర్తులు మిగలవు. ఆ గుర్తులు తను సృష్టించిన Work of Art piecesగా మిగులుతాయి.

కొన్ని వేల సార్లు రెప్పలార్చుకునే కనురెప్పల్లో గూడు కట్టుకునే అసామాన్యుల బతుకుల బోనాలు, మన పంచేద్రియాలను శుభ్రం చేసే మూల జీవితాల పునాదుల వేర్లూ, పువ్వులూ, నక్షత్రాలు...రమేష్ బాబు చూసిన చిత్రాలు. పనుల్లో , పరవశాలలో, పరుగుల్లో, పాటల మూటల మాటల్లో అనేకానేక బతుకు పార్శాలు ఎంతో లయాత్మకంగా, సమతుల్యంతో, విడిపోకుండా కదిలే గుండె పాటలు - మనల్ని నిలబెట్టి, మళ్లీ వెనక్కి రప్పించి, చూసేలా చేస్తాయి.

Sidhartha on Kandukuri Ramesh babu's single exhibit

రమేష్ చిత్రాలలో లేని జీవితం...ఎక్కడా కనబడదు, తను ప్రదర్శించిన Single exhibit ఒక అసామాన్య అనుభవం, చూసే చూడగలిగే...కన్నుకి. అంతా inanimatedగా ద్రవించి ప్రవహిస్తున్నట్టు భ్రాంతికి గురిచేసే జీవనధార, సాహచర్యధార, జగద్ధార...ఈ వొక్క చిత్రం. ఈ వొక్క చిత్రం జీవనాస్తిత్వపు పొరల్లో విద్యుత్తులా వొళ్లు విరుచుకున్న భూమి తల్లి accidental muse. అది సంభవిస్తుంది. అంతే తప్ప ...అంచనాలకు అందుబాటులో వుండదు.

- సిద్ధార్థ, 9603318460

English summary
A prominent Telugu poet Sidhartha writes on journalist and writer kandukuri Ramesh babu's single exhibit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X