వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల భారం ప్రజల మీద పడకూడదంటే....

By బి.జి. మహేష్
|
Google Oneindia TeluguNews

Election Commission Of India
ఓటర్లపై బలవంతంగా రుద్దబడుతున్న ఉప ఎన్నికలను నిషేధించవలసిన అవసరముంది. ప్రజాప్రతినిధి మరణించినప్పుడు ఉప ఎన్నిక జరిగితే తప్పులేదు. కానీ ఓటర్ల మీద కనీస గౌరవం లేకుండా రాజీనామా చేసినప్పుడు వచ్చే ఉప ఎన్నికల మీదే అభ్యంతరం. 2008 డిసెంబర్ లో కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు బిజెపి లోకి ఫిరాయించడంతో (ఆపరేషన్ కమల్) ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి.

ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసుకోవలసి వచ్చింది. అధికారికంగా పాతిక లక్షల వరకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఖర్చు చేయవచ్చు. ఉప ఎన్నికలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఎన్నికల సంఘం పరోక్షంగా ఈ పరిమితిని 25 కోట్లకు పెంచినట్టయింది.

భారతదేశంలో ఏప్రిల్/ మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ముఖ్యమైన లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులు యాభై కోట్ల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందని వార్తా కథనాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను నిషేధించాలి. ఎవరైనా ప్రజాప్రతినిధి రాజీనామా చేస్తే, అతని తర్వాత స్ధానంలో ఉన్న అభ్యర్ధిని ఎన్నికైనట్టు ప్రకటించాలి. విజేత రెండో అభ్యర్ధికి చెందిన పార్టీలోకి ఫిరాయించకపోయినప్పుడే ఇలా చేయాలి. ఉదాహరణకు కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకుంది. బిజెపి రెండో స్ధానంలో ఉంది. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్ధి బిజెపిలోకి ఫిరాయించకుండా ఉంటే రెండో స్ధానంలో ఉన్న బిజెపి అభ్యర్ధినే గెలిచినట్టుగా ప్రకటిస్తే ఉప ఎన్నికల భారం ప్రజల మీద పడకుండా ఉంటుంది.

అనేక నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులు పోటీ చేయకుండా ఎన్నికల సంఘం చూడాలి. ప్రభుత్వ ఖర్చు మీద ఉప ఎన్నికలు నిర్వహించవలసి వస్తోంది. ఒక స్ధానం ఉంచుకుని మిగితా స్ధానాలకు రాజీనామా చేసినప్పుడు ఆయా స్ధానాల్లో రెండో స్ధానంలో ఉన్న అభ్యర్ధిని ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటిస్తే బాగుంటుంది. ఇలా చేస్తే అభ్యర్ధులు ఒకటి కంటే ఎక్కువ స్ధానాలకు పోటీ చేయడం తగ్గిపోతుంది. సిటింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడం మనం చూస్తున్నదే. ఎంపీగా గెలిస్తే వారు ఎమ్మెల్యే స్ధానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఉప ఎన్నికల ఖర్చు ప్రజల మీద పడుతుంది. సిటింగ్ ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించకూడదు. ఈ నిబంధనను పెట్టని పక్షంలో రెండో స్ధానంలో ఉన్న అభ్యర్ధిని ఎన్నికైనట్టు ప్రకటించాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X