వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిలో 35: జగన్‌ను ఎదుర్కొనేందుకు బాబు ప్లాన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-YS Jagan
వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో చంద్రబాబు శుక్రవారం తన ఆస్తులను ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత కోసం, ప్రజల్లో రాజకీయల పట్ల విశ్వసనీయత నింపడం కోసమే తన కుటుంబం ఆస్తులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జగన్ ఆస్తులు వేల నుండి లక్షల కోట్లు ఉంటాయనే ఆరోపణలు వచ్చాయి. బాబు ఆస్తుల పైనా పలువురు విమర్శలు చేశారు. ప్రధానంగా జగన్ వర్గం నేతలు బాబు ఆస్తులపైన విమర్శలు గుప్పించారు.

జగన్‌కు చెందిన సాక్షి పత్రిక బాబు ఆస్తులపై కథనాలు ప్రచురించింది. ఇలా తన ఆస్తులపై విమర్శలు వస్తున్న సమయంలో అందరు నోళ్లు మూయించడానికి చంద్రబాబు తన ఆస్తులు ప్రకటించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అన్నాహజారేకు మద్దతుగా అవినీతిపై బాబు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించారు. ఇలాంటి సమయంలో ఆస్తులు ప్రకటించడమే మంచిదని బాబు భావించినట్లుగా కనిపిస్తోంది. తన ఆస్తులు ప్రకటించడం ద్వారా జగన్ అవినీతి ముందు తన స్వచ్ఛతను నిరూపించుకున్నట్లుగా కూడా ప్రజల్లో కలిగించవచ్చన్న భావన కూడా బాబులో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ప్రధానంగా యువకుడైన జగన్‌ను ఎదుర్కొనేందుకు బాబు సైతం అదే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ యువకుడు కావడంతో ఆయన పట్ల యువత కాస్త మొగ్గు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే టిడిపి తెలుగు యువతలో 35 ఏళ్లు దాటిన వారికి నో ఛాన్స్ అంటున్నట్టుగా కనిపిస్తోంది. టిడిపిని పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా అనుబంధ సంఘాలపై అధినేత దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. యవత జగన్ వైపు ఆకర్షితులు కాకుండా ఉండటానికే బాబు బిలో 35 వ్యూహంగా కనిపిస్తోంది. తెలుగు యువతలో 35 ఏళ్లకు పైగా ఉన్న వారు పలువురు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తెలుగు యువత అధ్యక్షుడికి సైతం 35కు పైగానే ఉన్నాయని వినికిడి. దీంతో ఈసారి ఇలాంటి వారికి కమిటీలో అవకాశం దక్కక పోవచ్చునని వాదనలు వినిపిస్తున్నాయి.

త్వరలో నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఎంపిక చేయాలని అధినేత భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో టిడిపి ముఖ్య నేతల తనయులకు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు నయుడు గాలి జగదీష్, ఎమ్మెల్యే కొత్తకోట తనయుడు సిద్ధార్థ, విజయనగరం జిల్లాకు చెందిన మరో నేత తనయుడికి అవకాశాలు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక టిఎన్ఎస్ఎఫ్‌లోనూ కేవలం కళాశాల విద్యార్థులకే చోటు కల్పించాలనే నిర్ణయానికి టిడిపి వచ్చినట్లుగా తెలుస్తోంది. కళాశాల యువతను పార్టీ వైపు తిప్పుకునేందుకు టిఎన్‌ఎస్ఎఫ్‌లో కేవలం విద్యార్థులకే చోటు కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Telugudesam Party chief Chandrababu Naidu chalked out strategy to face YSRC party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X