వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేలనున్న జగన్, కాంగ్రెస్ బలాబలాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
త్వరలో స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ బలాబలాలు తెలియనున్నాయి. నా దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నిలబడుతుందన్న జగన్ సవాల్, దమ్ముంటే పడగొట్టి చూడాలంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సవాళ్లకు నెల రోజుల్లో ఫలితం తెలియనుంది. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురు కోవడమే తప్ప ఖచ్చితమై బలం జగన్‌కు ఎంత, కిరణ్ ప్రభుత్వానికి ఎంత అనేది తెలియలేదు. కానీ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ బలాబలాలు ఎంటో స్పష్టం కానున్నాయి. జూలై, ఆగస్టులతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియనుంది. ఈ సమయంలో స్థానిక సంస్థల కోటా రూపంలో వస్తున్న ఎన్నికలపై ఎనిమిది జిల్లాలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నప్పటికీ పలువురు స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జగన్ వెంట వెళ్లి పోయారు. దీంతో ఎన్నికలు కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతూ జరిగే అవకాశాలు లేవు. దీంతో తన బలాన్ని చూపించేందుకు జగన్ పలువురు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను తన వైపు తిప్పుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దూకే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం తాను సూచించిన అభ్యర్థులకే ఓటు వేసేలా జగన్ పలువురిని కలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే జగన్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నప్పటికీ కిరణ్ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వ్యూహరచనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గానీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గానీ రంగంలోకి దిగలేదని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలు వ్యయంతో కూడుకున్నవి కావడం కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. జగన్‌కు ధీటుగా ఖర్చు పెట్టగలమా అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

English summary
Who are powerful in Ex MP YS Jaganmohan Reddy and Congress. It will be clear soon in MLC election. YS Jagan is concentrating on MLC election to show his strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X