వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి సీటుపై సబిత కొడుకు కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy - Karthik Reddy
హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కన్ను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంపై పడినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుండి బరిలోకి దిగాలని అధిష్టానం ఆయనకు సూచనలు కూడా చేసిందట. ప్రస్తుతం చేవెళ్ల నుండి జైపాల్ రెడ్డి ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దూత అమర్ కాలే వద్ద కార్తీక్ చేవెళ్ల టిక్కెట్ కావాలని కోరారట.

అమర్ కాలేకు పలువురు నేతలు జైపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జైపాల్ చేవేళ్ల నుండి గెలిచిన తర్వాత నియోజకవర్గానికి నిధులే రావడం లేదని పలువురు ఆరోపించారు. వచ్చేసారి ఆయనకు చేవెళ్ల టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. అతను ప్రజలతో కూడా నిత్యం టచ్‌లో ఉండరని అమర్ కాలేకు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత కార్తీక్ రెడ్డి కలిసి చేవెళ్ల సీటు విషయంపై ఆయనకు చెప్పారట.

మరోవైపు సర్వే సత్యనారాయణ సీటు పైన కూడా కొందరి కన్ను పడిందట. వమల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అమర్ కాలేను కలిసిన అనంతరం మాట్లాడుతూ... తన సీటుకు కొందరు కోరుకుంటున్నారని, గత ఎన్నికల్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చారని, ఈసారి తనకే టిక్కెట్ ఇస్తారని, తాను ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు.

నగర పరిధిలో ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లల నుండి బలమైన నాయకుడిని బరిలోకి దింపాలని అమర్ కాలేకు పలువురు సూచించారట. అంతేకాకుండా తెలంగాణపై ఏమీ తేల్చకుండా ఎవరిని నిలిపినా లాభం లేదని, తెలంగాణపై తేలిస్తేనే కాంగ్రెసు పార్టీకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందని కూడా పలువురు నేతలు అమర్ కాలేకు చెప్పారు.

English summary

 Home Minister Sabitha Indra Reddy's son Karthik Reddy is wanting Chevella Lok Sabha seat in the next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X