తెలంగాణకు త్రిమూర్తుల సేవలు..ఇదీ కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ జమిలీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది. ఈ కమిటీకి ఇటీవల తెలంగాణలో టీడీపీ నుంచి పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి చైర్మన్‌గా ఉంటారు. వీరితోపాటు మాజీ ఎంపీలు అజహరుద్దీన్, విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. వీరితోపాటు తెలంగాణలో పార్టీ సీనియర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి తర్వాత కనుమరుగయ్యారు. ప్రస్తుత సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న విజయశాంతి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

2014లో మెదక్ నుంచి ఓటమి

2014లో మెదక్ నుంచి ఓటమి

తొలి నుంచి ప్రజల అంశాలే కథలుగా సినిమాల్లో నటించిన విజయశాంతి.. రాములమ్మగా ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీలో, తర్వాత తెలంగాణ తల్లి పార్టీ.. ఆ పై టీఆర్ఎస్ పార్టీలో చేరి.. మెదక్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన నేపథ్యం ఉన్నది. కానీ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2014లో తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుత తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2009లో మొరాదాబాద్ నుంచి లోక్ సభకు తొలిసారి ఎన్నిక

2009లో మొరాదాబాద్ నుంచి లోక్ సభకు తొలిసారి ఎన్నిక

మరోవైపు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ నగర వాసి. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న అజహరుద్దీన్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. తర్వాతీ కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజహరుద్దీన్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లోక్‌సభా స్థానం నుంచి 2009లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు అసలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అజహరుద్దీన్‌ను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు.

2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు లబ్ధి

2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు లబ్ధి

హైదరాబాద్ నగర పరిధిలో ముస్లింల జనాభా ఎక్కువ. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీతోపాటు నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం పట్టణాల్లో అత్యధికులు ముస్లింలు ఉంటారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికార పార్టీ.. మజ్లిస్ పార్టీతో జత కట్టింది. రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ జట్టు కట్టి విజయం సాధించాయి. అజహరుద్దీన్‌ను తెలంగాణలో ప్రచారానికి వినియోగించుకుంటే ముస్లింలతోపాటు క్రికెట్ అభిమానుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరిందని చెప్తున్నారు.

ప్రచార కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం?

ప్రచార కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం?

2018లో ఏదో ఒక సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేసే అడుగులనూ అధికార టీఆర్ఎస్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఎలా ఎదుర్కోవాలని గులాబీ పార్టీ బాసులు యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఎదురు గాలి మొదలైందని తెలుస్తున్నది. కాంగ్రెస్‌పార్టీలో కార్యక్రమాలు కొనసాగించకముందే రేవంత్‌రెడ్డికి అసమ్మతి మొదలైంది. అప్పుడే అలకలు.. బుజ్జగింపులు మొదయ్యాయి. కాంగ్రెస్‌పార్టీలో వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతులు ఉండవని, తనకూ, మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వనట్టే, రేవంత్‌రెడ్డికి కూడా పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఉండదని సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకే అనుమతి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

గుజరాత్ ఎన్నికల్లో బిజీబిజీగా రాహుల్

గుజరాత్ ఎన్నికల్లో బిజీబిజీగా రాహుల్

దీంతో పాదయాత్రపై పెట్టుకున్న ఆశలను రేవంత్‌రెడ్డి వదిలేసుకున్నారు. ముస్లింలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. దీనికి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం లేదని తెలిసింది. దీంతో రేవంత్‌ ఆవేదనకు గురయ్యారని సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఆయనను బుజ్జగించారు. గుజరాత్‌ ఎన్నికలు ఉన్నందున పూర్తిస్థాయిలో రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేక పోతున్నారని, పదవుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుంతియా సర్దిచెప్పారు.

ఆత్మీయ సభలకు అనుమతించాలని కోరిన రేవంత్

ఆత్మీయ సభలకు అనుమతించాలని కోరిన రేవంత్

పార్టీలో సముచితస్థానం ఉంటుందని రేవంత్ రెడ్డికి కుంతియా చెప్పినట్టు తెలిసింది. మర్యాద పూర్వకంగానే రేవంత్‌తో కుంతియా భేటీ అయ్యారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 20న వరంగల్‌లో రాహుల్‌ సభ పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ సభపై రాహుల్‌ ఆఫీస్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో ఆ సభను కాంగ్రెస్‌ వాయిదా వేయాలని భావిస్తోంది. రాహుల్‌ సభ తర్వాత తన కార్యాచరణను ప్రారంభించాలని రేవంత్‌ ఇంతకుముందు అనుకున్నారు. సభను రద్దు చేయకుండా రాహుల్‌ స్థానంలో తనకు ప్రాధాన్యం కల్పించాలని కోరినట్టు తెలిసింది. వీలుకాని పక్షంలో జిల్లాల్లో ఆత్మీయ సమావేశాలకు అవకాశం ఇవ్వాలని కుంతియాకు రేవంత్‌ వివరించినట్టు తెలుస్తోంది. ఆత్మీయ సమావేశాలపై రాహుల్‌గాంధీకే నిర్ణయాన్ని వదిలేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress High Command for the first time is planning to appoint a Campaign Committee in Telangana ahead of the 2019 elections. Revanth Reddy is likely to lead the committee. He along with former Cricketer Azharuddin and Former MP Vijaya Shanti are likely to be the star campaigners for the party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి