వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ సెంచరీ దిశగా...: దూసుకెళ్తున్న మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

NDA heading towards 200 seat mark in LS: Survey
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దూసుకెళ్తున్నారు. ఎన్డీయేకు, మోడీకి క్రమంగా ఆదరణ పెరుగుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సర్వేలో ఎన్డీయేకు 180కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. తాజా సర్వేలో ఆ సంఖ్య 200 స్థానాలకు దూసుకెళ్తోంది.

సుమారు 200 సీట్లు దక్కించుకోవడం ఖాయమని తాజా సర్వేలో వెల్లడైంది. 2014 ఎన్నికల్లో అధికార యూపిఏ బలం 134 నుంచి 142 వరకే పరిమితమయ్యే అవకాశముందని సిఎన్ఎన్-ఐబిఎన్, ద వీక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

దీని ప్రకారం కాంగ్రెస్, బిజెపిలు నేరుగా తలపడుతున్న నాలుగు(మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ) రాష్ట్రాల్లో బిజెపి భారీగా లబ్ధి పొందనుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 72 లోక్‌సభ స్థానాల్లో బిజెపి 57 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 12 మాత్రమే దక్కుతాయని అంచనా.

మొత్తంగా ఎన్డీయే కూటమికి 187 నుంచి 195 సీట్లు రావచ్చని సర్వే సంస్థ పేర్కొంది. ఇక ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కంటే మోడీనే ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నారు. అత్యధికంగా 45 శాతం ఓటర్ల మొగ్గు మోడీ వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో బిజెపి కాంగ్రెసును మట్టికరిపించే అవకాశాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో 2009 లోకసభ ఎన్నికల్లా కాంగ్రెసు 40 స్థానాలు గెలుచుకుంది. 28 స్థానాలు ఇప్పుడు కోల్పోనుంది. అవన్నీ ఎన్డీయే ఖాతాలో పడనుననాయి.

English summary

 NDA is edging towards the 200 seat mark riding on projected gains in four states in the 2014 Lok Sabha polls, with UPA's tally likely to slip to between 134 to 142 seats, a pre-poll survey says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X