వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి లేఖ: సీమాంధ్రకు సోనియా విష్ లిస్ట్ ఇదే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం 2014ను అమలు చేసే విషయంలో సీమాంధ్రకు తమ యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం లేఖ రాశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేీదన రాజ్యసభలో అప్పటి ప్రధాని, హోం మంత్రి సీమాంధ్రకు కొన్ని హామీలు ఇచ్చారని, వాటిపై మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుందని ఆమె గుర్తు చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించడంతో పాటు తాము ఇచ్చిన ఇతర హామీలను కూడా ఆమె లేఖలో క్రోడీకరించారు.

యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. సోనియా మంత్రిత్వ శాఖల వారీగా తాము సీమాంధ్రకు ఇచ్చిన హామీలను తన లేఖలో క్రోడీకరించారు.

Sonia sends Modi her wish list for Seemandhra

సోనియా విష్ లిస్ట్ ఇదే...

జలనవరుల శాఖ కింద...

1. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నోటిఫికేషన్

2. కెడబ్ల్యుడిటి - 2 రెఫనరెన్స్‌కు అడిషనల్ టర్మ్స్ నోటిఫికేషన్

3. జలవనరులపై ఉన్నతస్థాయి మండలి నోటిఫికేషన్

4. తుంగభద్ర బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్

5. కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ బోర్డుల నోటిఫికేషన్

హోం మంత్రిత్వ శాఖ కింద...

1. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించడానికి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆర్డినెన్స్

2. కేంద్ర ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుచ్ఛక్తి పంపకానికి సంబంధించి చట్టంలోని లోపాలను సరిదిద్దుతూ ఆర్డినెన్స్

3. విపత్తుల నిర్వహణ జాతీయ సంస్థ ఏర్పాటుపై క్యాబినెట్ నోట్

4. చట్టంలోని 8వ సెక్షన్ కింద గవర్నర్ ప్రత్యేక బాధ్తలను స్పష్టం చేస్తూ నిబంధనలను జారీ చేయడం

5. అదనపు పోలీసు బలగాల పెంపునకు మద్దతు

6. ఎపిలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని, ఆపరేషనల్ హబ్‌ను ఆధీనంలోకి తీసుకోవడం.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద..

1. 14వ ఆర్థిక కమిషన్‌పై మంత్రివర్గ నిర్ణయం ఫాలో అప్

2. 13వ ఆర్థిక కమిషన్ అవార్డు కేటాయింపు

3. 2014 - 15 రెగ్యులర్ బడ్జెట్‌లో రెవెన్యూ లోటను భర్తీ చేయడానికి 2014 - 15 కోసం ప్రత్యేక గ్రాంట్

4. వెనకబడిన ప్రాంతాల కోసం ఉత్తరాఖండ్ తరహాలో పరిశ్రమలకు ఆర్థిక రాయితీలు

5. కొత్త రాజధాని ఏర్పాటుకు ఆర్థిక సహాయం.

మానవ వనరుల శాఖ కింద

1. ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, నిట్, ఐఐఎస్ఇఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు క్యాబినెట్ నోట్ తయారీ

ఆరోగ్య శాఖ కింద..

ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు క్యాబినెట్ నోట్ తయారీ

పౌర విమానయాన శాఖ కింద...

విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా రూపుదిద్దడంపై క్యాబినెట్ నోట్ తయారీ

రక్షణ శాఖ కింద..

విశాఖపట్నం పూర్తి స్థాయి విమానాశ్రయంగా పనిచేయడానికి భారత నావికా దళం అనుమతి.

పెట్రోలియం, ఐఒసి, హెచ్‌పిసిఎల్ మంత్రిత్వ శాఖ కింద..

1. పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్ నోట్

2. గ్రీన్‌ఫిల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్స్ స్థాపనకు సంబంధించి సాధ్యాసాధ్యాలు

పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద..

విశాఖపట్నం, విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైలు స్థాపన, మెట్రోపాలిటన్ పట్టణఆభివృద్ధి సంస్థ సాధ్యాసాధ్యాల అధ్యయనం

రైల్వే మంత్రిత్వ శాఖ కింద..

1. కొత్త రైల్వే జోన్ స్థాపన సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపి, నిర్ణయాన్ని సత్వరమే తీసుకోవడం.

2. కొత్త రాజధానికి, హైదరాబాద్‌కు మధ్య అత్యంత వేగంగా రైలు కనెక్టివిటీ

ఉక్కు మంత్రిత్వ శాఖ కింద..

కడప జిల్లాలో ఉక్కు కార్మాగార స్తాపన సాధ్యాసాధ్యాలు

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద

ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ సాధ్యాసాధ్యాలు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద...

వ్యవసాయ, హార్టికల్చరల్ విశ్వవిద్యాలయ స్థాపనపై క్యాబినెట్ నోట్స్

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద

గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనపై క్యాబినెట్ నోట్

కమ్యూనికేషన్, ఐటి మంత్రిత్వ శాఖ కింద

ట్రిపుల్ ఐటి ఏర్పాటుపై క్యాబినెట్ నోట్

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కింద

దుగ్గిరాజుపట్నం వద్ద కొత్త బారీ ఓడరేవు అభివృద్ధిపై క్యాబినెట్ నోట్

ప్రణాళికా సంఘానికి సంబంధించి..

1. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ నోటిఫికేషన్

2. ఉపాధ్యక్షుడి కింద సీమాంధ్ర కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, పని ప్రారంభించడం

3. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజీని రూపొందించడం

పర్సనల్, ట్రైనింగ్ శాఖ కింద..

అధికారుల పంపిణీపై కమలనాథన్ (రాష్ట్ర స్థాయి), ప్రత్యూష్ సిన్హా (అఖిల భారత సర్వీసులు) సిఫార్సులకు తుది రూపం ఇవ్వడం

లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ కింద..

కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమైతే అటవీ భూములను డీనోటిఫై చేయడం

English summary
Congress president Sonia Gandhi on Tuesday wrote to Prime Minister Narendra Modi urging him to fulfil the commitments made by the UPA government towards Seemandhra, the residuary Andhra Pradesh, while implementing the Andhra Pradesh Reorganization Act, 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X